సాహసం, సరదాల పేరుతో యువత తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. రకరకాల విన్యాసాలతో నిండు జీవితాలను మధ్యలోనే ముగిస్తున్నారు. ఎత్తైన ప్రదేశాల్లోకి వెళ్లి సెల్ఫీలు దిగడం, బైక్ డ్రైవ్ చేస్తూ కాళ్ళు, చేతులు వదిలేయడం.. రన్నింగ్ ట్రైన్ లో స్టంట్స్ చేయడం.. లాంటివి ఎక్కువవుతున్నాయి. పాపులారిటీ కోసమే ఇలాంటి స్టంట్స్ చేస్తున్నా.. అవి సుఖాంతంగా ముగియక ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ కోవకు చెందిన ఘటన ఒకటి చెన్నైలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
చెన్నైలోని స్టేట్ కాలేజీ కి చెందిన కొందరు విద్యార్థులు తిరువళ్లూరు నుండి ఆరుక్కోణం వెళ్లే సమయంలో లోకల్ ట్రైన్ లో ప్రయాణించారు. రన్నింగ్ ట్రైన్ లోకి ఎక్కి స్టంట్స్ చేస్తూ పలువురు విద్యార్థులు హల్ చల్ చేశారు. ఈ క్రమంలో బయట విండోలపై కాళ్లు పెట్టి.. చేతులు పైకి ఊపుతూ విన్యాసాలు చేశారు. ఈ ఘటనలో నీతి దేవన్ అనే విద్యార్ధి ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రమాదకర స్థితిలో స్టంట్స్ చేస్తూ పలువురు ప్రాణాలు కోల్పోతున్నా అధికారులు చర్యలు తీసుకోవట్లేదని పలువురు వాపోతున్నారు.
— Govardhan Reddy (@gova3555) May 28, 2022