గురువారం తెల్లవారుజామున ఘోర విషాదం సంభవించింది. కెమికల్ ట్యాంక్ నుంచి కెమికల్స్ లీకయ్యాయి. ఆ కెమికల్స్ పీల్చుకుని ఆరుగురు మృతి చెందారు. 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ దుర్ఘటన గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లోని సచిన్ జీఐడీసీ ప్రాంతంలో తెల్లవారుజామున జరిగింది. రోడ్డు పక్కన పార్క్ చేసున్న ట్యాంకర్ నుంచి విషయవాయువులు లీకయ్యాయి.
Gujarat: Six people died and 20 others were admitted to the civil hospital after gas leakage at a company in Sachin GIDC area of Surat early morning today, says hospital’s In Charge Superintendent, Dr Omkar Chaudhary pic.twitter.com/HVnH9CZHYl
— ANI (@ANI) January 6, 2022
ట్యాంకర్ పార్క్ చేసిన ప్రాంతానికి 10 మీటర్ల దూరంలో ఉన్న విశ్వప్రేమ్ మిల్లులోని కార్మికులు ఈ విషవాయువును పీల్చారు. వారు కాసేపటికే స్పృహ కోల్పోయారు. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. మిల్లులో దూరంగా ఉన్న కార్మికులు పరిస్థితిని గ్రహించి ఆస్పత్రికి ఫోన్ చేశారు. తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో కార్మికుడు మరణించాడు.
सूरत में हुए गैस लीक हादसे से जिनके प्रियजनों की जान गयीं, उन्हें शोक संवेदनाएँ।
अन्य पीड़ितों के जल्द ठीक होने की कामना करता हूँ।
भविष्य में ऐसे हादसे रोकने के लिए सही जाँच होनी चाहिए। pic.twitter.com/6Ou3EWJXi4— Rahul Gandhi (@RahulGandhi) January 6, 2022
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని బాధితులను ఆస్పత్రికి తరలించారు. ట్యాంకర్ పార్క్ చేసిన చుట్టుపక్కల ప్రాంతాలను అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితులు అన్నీ సాధారణ స్థితికి వచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఈ దుర్ఘటన ఎలా జరిగింది అనేదానిపై విచారణ ప్రారంభించారు. ఆ ట్యాంకర్ ఎవరిది? ఎందుకు అక్కడ పార్క్ చేశారు. అసలు కెమికల్స్ ఎలా లీక్ అయ్యాయి అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#Breaking | 6 deaths get reported in Gujarat’s Surat where a gas leak has taken place.
22 others are ill with 8 on ventilator support.@dave_janak shares details with @JamwalNews18 . pic.twitter.com/E1nkLrp5Sg
— News18 (@CNNnews18) January 6, 2022