ఈ మద్య కొంతమంది కేటుగాళ్లు ఈజీ మనీ కోసం దేనికైనా సిద్దపడుతున్నారు. ఎదుటి వ్యక్తిని ఈజీగా మోసం చేసి దోచుకుంటున్నారు.. మరికొంత మంది ఆయుధాలు ఉపయోగించి దోచుకు వెళ్తున్నారు. ఇటీవల దేశ వ్యాప్తంగా పలు చోట్ల చైన్ స్నాచింగ్ కేసులు ఎక్కువ అయ్యాయి. మహిళలు ఒంటిరిగా కనిపిస్తే చాలు దోచుకుంటున్నారు.
ఈజీ మనీ కోసం ఎన్నో అక్రమాలకు పాల్పపడుతున్నారు కొంతమంది కేటుగాళ్ళు. రోడ్లపై మహిళలు ఒంటరిగా నడిచి వస్తుంటే మాటు వేసి వారి మెడలో నగలు దోచుకు వెళ్తున్నారు. ఒక్కోసారి ఇలాంటి ఘటనల్లో మహిళలకు తీవ్ర గాయాలు కావడమే కాదు.. కొంతమంది చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ దుండగుడు పబ్లిక్ ప్లేస్ లో మహిళకు గన్ చూపించి నగలు దోచుకు వెల్లాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతుంది.
దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలే ఓ దొంగ రెచ్చిపోయాడు. ముఖానికి మాస్క్ వేసుకొని బైక్ పై వచ్చిన దొంగ మహిళ మెడలో ఉన్న నక్లెస్ ని దోచుకు వెళ్లాడు. అయితే ఆ దొంగ చేతిలో గన్ ఉండటంతో చుట్టు పక్కల ఉన్నవాళ్లు ఏం చేయలేకపోయారు. ఇలా వచ్చి అలా మహిళ మెడలో నక్లెస్ దోచుకు పోయారు. ఈ సంఘటన ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో జరిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోహిణీ ప్రాంతం చాలా రద్దీగా ఉంటుంది. ఓ మహిళ రోడ్డు పక్కన ఉన్న షాప్ వద్ద నిల్చుని ఉంది. అంతలోనే ఇద్దరు దొంగలు ఆమె వద్దకు సమీపించారు.
ఒక దొంగ బైక్ ని రన్నింగ్ లో ఉంచాడు.. మరో దొంగ ఆ మహిళ వద్దు వచ్చి మెడలో ఉన్న నెక్లెస్ ని దొంగిలించి తీసుకు వెళ్లాడు. ఆ సమయంలో దొంగ చేతిలో గన్ ఉంది.. దానితో బెదిరించాడు. దొంగ నెక్లెస్ దొంగిలించే సమయంలో ఆ మహిళ షాప్ లోకి వెళ్లే ప్రయత్నం చేసింది.. కానీ ఆమెను వదలకుండా కింద పడేసి గన్ చూపిస్తూ నెక్లెస్ దోచుకెళ్లాడు దొంగ. షాప్ లోకి వచ్చిన మహిళను రక్షించాలని ప్రయత్నించినా అతను గన్ తో బెదిరించడం వారు మిన్నకుండిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు.
Two bike-borne men snatched chain from a woman at gunpoint, in Delhi’s Rohini area on April 13; police investigation underway: Delhi Police #AsadAhmedEncounter #WTCFinal #BusAccident #amritpalfraudleader #ArvindKejriwal #Suriya42 #7YearsOfFan #지민브평4월1위축하해 #ViratKohli pic.twitter.com/UGMnJSzZqX
— TejasswiPrakash (@Tejasswi22) April 15, 2023