దేశంలో దొంగల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దొంగతనాలకు అడ్డొచ్చిన వారిని చంపటానికి సైతం వెనుకాడటం లేదు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని షాలిమార్ బాగ్ ప్రాంతంలో ఇద్దరు దుండగులు మొబైల్ స్నాచింగ్ కు పాల్పడ్డారు. ఈ క్రమంలో దుండగులు వారి బైక్ తో ఓ మహిళను దాదాపు 150 మీటర్ల మేరకు ఈడ్చుకెళ్లారు. ఈ అమానుష ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బాధితురాలు షాలిమార్ బాగ్ ప్రాంతంలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో పని చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆ మహిళ డ్యూటీ ముగించుకుని ఒంటరిగా ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో దుండగులు(స్నాచర్స్) ఆమెను టార్గెట్ చేశారు. బైక్ పై వచ్చి ఆమె చేతిలోని మొబైల్ లాక్కుని వెళ్తుండగా.. ఆమె బైక్ ను పట్టుకుని ఆపే ప్రయత్నం చేసింది. కానీ ఈ క్రమంలో ఆమెను రోడ్డుపై దాదాపు 150 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లారు దుండగులు. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని పోలీసులు అరెస్టు చేసి.. అతని నుంచి బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడికోసం గాలిస్తున్నారు. ఈ ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయండి.
#WATCH | A mobile-snatching incident was reported in the Shalimar Bagh area, on December 16, at 1735 hours, where 2 men on a scooty dragged the victim on the road while snatching her phone: Delhi Police
(Source: CCTV Footage) pic.twitter.com/GYZDw6Uj0J
— ANI (@ANI) December 17, 2021