నెల రోజుల నుంచి మణిపూర్ లో పెద్ద ఎత్తున అల్లర్లు కొనసాగుతున్న విషయం తెలిసిందే. రెండు వర్గాల మధ్య చెలరేగిన విభేదాలు ఘర్షణలకు దారి తీశాయి. ఒకరిపై ఒకరు దాడులు చేస్తూ విధ్వంసాలు సృష్టిస్తున్నారు.
గత కొన్నిరోజులుగా ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో దారుణమైన హింసాకాండ కొనసాగుతుంది. రెండు వర్గాల మధ్య వచ్చిన విభేదాలు చిలికి చిలికి గాలివానై ఘర్షణలు చెలరేగాయి. దాదాపు నెల రోజులు దాటినా పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. ఈ మద్యనే కేంద్ర హూం శాఖ మంత్రి అమిత్ షా స్వయంగా నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో ఉండి పరిస్థితిని చక్కదిద్దే యత్నం చేశారు.. అప్పటి వరకు కాస్త అల్లర్లు సర్దుమణిగినా.. మళ్లీ ప్రారంభం అయ్యాయి. బుధవారం రాష్ట్ర మహిళా మంత్రి ఇంటికి నిప్పు పెట్టిన దుండగులు ఇప్పుడు ఏకంగా కేంద్ర మంత్రి ఇంటిపై పెట్రో బాంబులతో దాడి చేశారు. వివరాల్లోకి వెళితే..
గత నెల రోజులుగా మణిపూర్ లో రెండు వర్గాల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మణిపూర్ రావణకాష్టంగా కాలిపోతుంది. ఇప్పటికే కొంతమంది దుండగులు రాష్ట్ర మహిళా మంత్రి ఇంటికి నిప్పు పెట్ట రచ్చ చేశారు. తాజాగా కేంద్ర మంత్రి ఆర్కే రంజన్ సింగ్ ఇంటిపై దాడిచేశారు. ఇంఫాల్ లో కర్ఫ్యూ విధించడాన్ని నిరసిస్తూ.. గురువారం రాత్రి కోంగ్బా ప్రాంతంలో ఉన్న మంత్రి ఆర్కే రంజన్ సింగ్ నివాసాన్ని సుమారు వెయ్యి మంతికి పైగా ఆందోళన కారులు చుట్టు ముట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇంటిపై పెట్రో బాంబులతో దాడి చేశారు. ఈ ఘటనలో ఇళ్లు మొత్తం ధ్వంసం అయ్యింది. ఆ సమయంలో కేంద్ర మంత్రి ఇంట్లో లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని పోలీసులు వెల్లడించారు.
గురువారం రాత్రి కేంద్ర మంత్రి ఆర్కే రంజన్ సింగ్ నివాసంపై నిరసన కారులు పెట్రో బాంబులతో దాడి చేసిన సమయంలో తొమ్మిది మంది ఎస్కార్ట్ సిబ్బంది, సెక్యూరిటీ గార్డ్స్ తో పాటు ఎనిమిది మంది అడిషనల్ గార్డ్స్ విధుల్లో ఉన్నారని.. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని భద్రతా అధికారి తెలిపారు. నిరసన కారులు పెద్ద ఎత్తున తరలిరావడంతో వారిని అడ్డుకోలేకపోయామని ఎస్కార్ట్ కమాండర్ ఎల్ దినేశ్వర్ సింగ్ అన్నారు. నిరసన కారులు మంత్రి ఇంటిని నాలుగు వైపులా చుట్టు ముట్టి బాంబులు విసిరారని పరిస్థితిని నియంత్రించలేకపోయామని తెలిపారు. ఈ దాడిలో మంత్రి ఇల్లు మొత్తం ధ్వంసం అయినట్లు సమాచారం. అయితే రంజన్ సింగ్ ఇంటిపై దాడి జరగడం ఇది రెండోసారి. మే నెలలో ఆయన ఇంటిపై దాడికి యత్నించగా.. భద్రతా సిబ్బంది గాల్లో ఫైర్ చేయడంతో నిరసన కారులు వెనక్కి తగ్గారు.
Manipur violence: Union Minister Rajkumar Ranjan’s house set on fire in Imphal, petrol bombs hurledhttps://t.co/yYAV0L1Xvu
— OpIndia.com (@OpIndia_com) June 16, 2023