ప్రజాప్రతినిధులు అంటే ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన వారు. అయితే కొందరు గెలిచే వరకు ఒకలా..ఆ తరువాత మరోలా ప్రవర్తిస్తుంటారు. మరికొందరు మాత్రం ప్రజలకు ఇచ్చిన మాట కోసం ప్రభుత్వం సైతం పోరాటం చేస్తుంటారు. అలా ప్రజల కోసం పోరాటం చేసే ప్రజాప్రతినిధిని.. జీవితాంతం అందరు గుర్తుంచుకుంటారు. అలాంటి వ్యక్తి.. మధ్యప్రదేశ్ మంత్రి ప్రద్యుమన్ సింగ్ తోమర్. తన నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రోడ్లు దారుణంగా ఉన్నాయని, అవి వేస్తే.. తాను చెప్పులతో వేసుకుని నడుస్తాని ప్రతిజ్ఞ చేశాడు. అలానే చెప్పులు లేకుండా 56 రోజుల పాటు నడిచారు. చివరకు ఆయన అనుకున్నది జరగటంతో సంతోషం వ్యక్తం చేశారు. ఆయనకు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య స్వయంగా కొత్త చెప్పులు అందించారు. ప్రస్తుత ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజకీయ్లాలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అతి కొద్దిమంది వ్యక్తుల్లో.. ఆ రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి ప్రద్యుమన్ సింగ్ తోమర్ ఒకరు. ఆయన తనదైన చరిష్మాతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేత కొనసాగుతున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ.. వారి సమస్యలను పరిష్కరిస్తుంటారు. అలానే ఈ గ్వాలియర్ నియోజకవర్గంలో అధ్వానంగా మారిన రోడ్లు బాగా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రద్యుమన్ సింగ్.. ఈ ఏడాది అక్టోబరు 30 నుంచి చెప్పులు వేసుకోకుండానే తిరుగుతున్నారు. రోడ్ల మరమ్మతులు చేస్తేనే తాను చెప్పులు వేసుకుంటానని ప్రతిజ్ఞ చేశారు.
ఇటీవలే రోడ్లు పనులు ప్రారంభమయ్యాయి. త్వరలో ఆ నియోజకవర్గంలోని రహదారుల రూపురేఖలు మారనున్నాయి. దీంతో ఆదివారం ఓ కార్యక్రమంలో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్వయంగా ప్రద్యుమన్ సింగ్ తోమర్ల కొత్త చెప్పులు అందించారు. అనంతరం జ్యోతిరాదిత్య పాదాలకు సింగ్ నమష్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. పదవిలోకి వచ్చామా… దోచుకున్నామా… కూడబెట్టుకున్నామా అనే వాళ్లే ఎక్కువయ్యారు. ఇలాంటి వారిది మధ్యలో ప్రజల కోసం పనిచేసే ప్రద్యుమన్ సింగ్ లాంటి ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు.