ఓటీటీల్లో మితిమీరిన శృంగార సన్నివేశాలు, ఘాటు సన్నివేశాలు ఎక్కువైపోయాయి. అశ్లీల కంటెంట్ తో పాటు అసభ్యకరమైన పదజాలాన్ని వాడేస్తున్నారు. దీంతో పలువురు ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదులపై స్పందించిన కేంద్ర మంత్రి ఓటీటీ కంటెంట్ క్రియేటర్లకు హెచ్చరికలు జారీ చేశారు.
క్రియేటివిటీ పేరుతో ఈ మధ్య ఓటీటీల్లో విచ్చలవిడి శృంగార సన్నివేశాలు, ఘాటు సన్నివేశాలు, అదర చుంబనాలు, బూతులు, అశ్లీలత ఎక్కువ వాడేస్తున్నారని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. ఓటీటీల్లో క్రియేటివిటీ సాకుతో అశ్లీలత, అసభ్యకర పదజాలం వాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు అసభ్యకరంగా ఉంటున్నాయని కొంతమంది ఫిర్యాదులు చేస్తున్నారు. ఆ ఫిర్యాదులను ఉద్దేశించి నాగ్ పూర్ లో మీడియాతో మాట్లాడిన అనురాగ్ ఠాకూర్ అటువంటి కంటెంట్ చేసేవారికి హెచ్చరికలు జారీ చేశారు.
స్వేచ్ఛ అనేది కేవలం క్రియేటివిటీ కోసమేనని, అశ్లీలత కోసం కాదని కంటెంట్ విషయంలో అవధులు దాటితే ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి వెనుకాడదని ముందస్తు హెచ్చరిక చేశారు. కేవలం క్రియేటివిటీ కోసమే ఓటీటీ ప్లాట్ ఫామ్ లకు స్వేచ్ఛ ఇచ్చారని.. అశ్లీలతను చూపించడానికి కాదని.. ఎవరైనా పరిధి దాటినా, క్రియేటివిటీ పేరుతో అసభ్యకర పదజాలాన్ని వాడినా అంగీకరించేది లేదని అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ఓటీటీల్లో అశ్లీలత, బూతు పదజాలం ఎక్కువైపోతుందని వస్తున్న ఫిర్యాదులపై ప్రభుత్వం చాలా సీరియస్ ఆ ఉందని అన్నారు. ఓటీటీ నిబంధనల్లో మార్పులు చేయాల్సి వస్తే సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వెనుకాడదని స్పష్టం చేశారు.
కంటెంట్ పై వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించాల్సిన బాధ్యత నిర్మాతలదే అని, అందిన ఫిర్యాదుల మేరకు అవసరమైన మార్పులు చేసి 90 నుంచి 92 శాతం నిర్మాతలే పరిష్కరించాలని అన్నారు. ఆ తర్వాత ఫిర్యాదులను పరిష్కరించే బాధ్యత నిర్మాతల అసోసియేషన్ దేనని అన్నారు. వీలైనంత వరకూ అసోసియేషన్ లోనే ఫిర్యాదులన్నిటినీ పరిష్కరించాలని అన్నారు. ఆఖరున ఆ ఫిర్యాదులు ప్రభుత్వం వద్దకు రావాలని అన్నారు. నిబంధనలకు అనుగుణంగా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని, గత కొన్ని రోజులుగా ఫిర్యాదుల సంఖ్య పెరుగుతుందని, దీన్ని మంత్రిత్వ శాఖ సీరియస్ గా తీసుకుంటుందని అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ఒకవేళ ఈ వ్యవస్థలో ఏదైనా మార్పులు అవసరం అనుకుంటే చేయడానికి సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సిద్ధంగా ఉందని అన్నారు. మరి ఓటీటీల్లో అశ్లీలత, అసభ్యపదజాలంతో కూడిన కంటెంట్ ను ఇకపై అంగీకరించేది లేదన్న కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
क्रिएटिविटी के नाम पर गाली गलौज, असभ्यता बर्दाश्त नहीं की जा सकती।
ओटीटी पर बढ़ते अश्लील कंटेंट की शिकायत पर सरकार गंभीर है।अगर इसको लेकर नियमों में कोई बदलाव करने की ज़रूरत पड़ी तो @MIB_India उस दिशा में भी पीछे नहीं हटेगा। अश्लीलता, गाली गलौज रोकने के लिए कड़ी कार्यवाई करेगा। pic.twitter.com/6pOL66s88L
— Anurag Thakur (@ianuragthakur) March 19, 2023