కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా సృష్టించిన కల్లోలం అంతాఇంతా కాదు. ఈ వైరస్ దెబ్బకి లక్షలాది మంది మరణించారు. ఇది చాలామంది జీవితాలను చిన్నాభిన్నం చేసింది. కరోనా వ్యాప్తి ప్రారంభ సమయంలో కేంద్రం పలు ఆంక్షలతో పాటు కీలక నిర్ణయాలు తీసుకుంది. వాటిలో ఒకటి ఈ కరోనా కాలర్ ట్యూన్. అర్జెంట్ గా ఎవరికి ఫోన్ చేద్దామన్నా నెంబర్ డయల్ చేయగానే ముందుగా ఈ కరోనా కాలర్ ట్యూన్ వినిపిస్తుంది. కానీ, ఇప్పుడు ఆ కాలర్ ట్యూన్ నుంచి అందరికి విముక్తి ఇవ్వనుంది కేంద్ర ప్రభుత్వం.
దేశంలోకి కోవిడ్ ఎంట్రీ ఇచ్చాక.. ప్రజలకు అవగాహన కల్పించేదుకు ఈ కాలర్ ట్యూన్‌ను టెలికాం ఆపరేటర్లు ఈ ప్రీకాల్-ఆడియో యాడ్స్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలతో తప్పనిసరి చేశారు. అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కాలర్ ట్యూన్ ప్రతి ఒక్కరికి వినిపిస్తూనే ఉంది. కరోనా అవగాహన కాలర్ ట్యూన్ తర్వాత.. వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పిస్తూ మళ్లీ కాలర్‌ట్యూన్ సెట్ చేశారు. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు బాగా తగ్గిపోయాయి. కొత్త కొత్త వేరియంటక్లు రావడం కామన్ అయిపోయింది. పైగా మార్చి 31 నుంచి కరోనా ఆంక్షలన్నీ ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించిన విషయం తెలిసిందే.అయితే కరోనా కంటే కరోనా కలర్ ట్యూనే ప్రజలను ఎక్కువగా విసిగిస్తోంది. అందుకే ఇకపై దాన్ని కూడా ఆపేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందట. ఈ ప్రీకాల్-ఆడియో ప్రకటనల కారణంగా అత్యవసర సమయాల్లో ఫోన్‌కాల్ మాట్లాడటం ఆలస్యమవుతోందని ఇప్పటికే చాలామంది ఫిర్యాదు చేశారు. కొందరై ఈ విషయంలో ఏకంగా కోర్టులను కూడా ఆశ్రయించారు. అయినా అన్నింటి కంటే ప్రజారోగ్యం ముఖ్యం కాబట్టి ఈ ట్యూన్‌ను కొనసాగిస్తూ వస్తున్నారు. తాజాగా కేంద్రం ఈ కరోనా కాలర్ ట్యూన్ నిలిపివేయనుంది. మరి..ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.