కొన్ని రోజుల నుంచి 2000 రూపాయల నోట్లకు సంబంధించి ఒక చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. రెండువేల నోట్లను రద్దుచేయబోతున్నారని గతకొంతకాలంగా ఊహాగాణాలు సోషల్ మీడియా వేదికగా హల్ చల్ చేస్తున్నాయి. అందుకే ఏటీఎంలో కూడా రెండు వేల నోట్లు రావడం లేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రెండు వేల నోట్లపై కేంద్రం కీలక ప్రకటన చేసింది.
ఆరేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం వెయ్యి, ఐదు వందల నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. వాటి స్థానంలో కొత్త ఐదు వందల నోట్లు, అలానే రెండు వేల నోట్లను కేంద్రం వినియోగంలోకి తెచ్చింది. నోట్ల రద్దు జరిగిన నాటి నుంచి ఈ కొత్త నోట్ల చలామణి విస్తృతంగా జరిగింది. అయితే గత కొంతకాలం నుంచి 2000 నోటు మార్కెట్ లో కనబడటం లేదని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. అలానే సెలబ్రిటీలు కూడా పలు ఇంటర్వ్యూలలో తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో రెండు వేల నోట్ల చలామణిపై మంగళవారం కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
దాదాపు పదేళ్ల తరువాత 2014 కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ఆ తరువాత ప్రధానమంత్రి హోదాలో నరేంద్రమోదీ అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అలానే 2016 నవంబర్ 8న నోట్ల రద్దు నిర్ణయం కూడా తీసుకున్నారు. రూ.1000, రూ.500ల నోట్లు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో వాటి స్థానంలో రూ.2000 నోట్లు, కొత్త 500 నోట్లను చలామణిలోకి తీసుకొచ్చింది. అలా 2016 నుంచి నేటి వరకు ఈ నోట్లు మార్కెట్ లో చలామణి అవుతున్నాయి.
అయితే కొంతకాలం నుంచి రూ.2000 నోట్లు మార్కెట్ లో కనిపించడం లేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అలానే ఏటీఎంలో సైతం రెండు వేల నోట్లు రావడంలేదని మరికొందరు అంటున్నారు. అలానే సెలబ్రిటీలు సైతం రెండు నోట్లు కనపడటం లేదని పలు ఇంటర్యూల్లో తెలిపారు. తాజాగా రెండు వేల నోట్లపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. ” ఏటీఎంలో రెండు వేల నోట్లు ఉంచడం అనేది పూర్తిగా బ్యాంకుల నిర్ణయమని ఆమె స్పష్టం చేశారు. ఏటీఎంలో రెండు వేల నోట్లు ఉంచొద్దని ఇప్పటివరకు కేంద్రం నుండి ఎటువంటి ప్రకటన రాలేదని ఆమె పేర్కొన్నారు.
ఆర్బీఐ తెలిపిన వివరాల ప్రకారం గత ఏడాది మార్చి నాటికి రూ.500, రూ. 2000 నోట్ల మొత్తం విలువ రూ.27,057 లక్షల కోట్లని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఇంత భారీ మొత్తంలో 2000 నోట్లు ఉన్నాయని చెప్పిన ఆమె.. ఏటీఎంలలో ఈ నోట్లు నింపకూడదని బ్యాంకులకు కేంద్రం ఎలాంటి సూచనలు ఇవ్వలేదని చెప్పారు. తమ వినియోదారుల అవసరాలకు అనుగుణంగా బ్యాంకులు ఏటీఎంలలో నోట్లను నింపుతాయని ఆమె వివరించారు. మరి.. తాజాగా ఆమె చేసిన ఈ ప్రకటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.