విద్యుత్ వినియోగదారులకు ఊరట కలిగించేలా కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. విద్యుత్ బిల్లులు తగ్గించుకునేలా ఎలక్ట్రిసిటీ రూల్స్ 2020ని అమలులోకి తీసుకురానుంది. ఈ కారణంగా విద్యుత్ బిల్లులు తగ్గుతాయని వెల్లడించింది.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యుత్ వినియోగదారులకు ఊరట కలగనుంది. ఎలక్ట్రిసిటీ రూల్స్ 2020ని అమలులోకి తీసుకురానుంది. ఈ కారణంగా వినియోగదారులు విద్యుత్ బిల్లును తగ్గించుకోవచ్చునని ప్రభుత్వం వెల్లడించింది. టైం ఆఫ్ డే టారిఫ్ సిస్టం ద్వారా ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్ట్రిసిటీ టారిఫ్ సిస్టంలోని మార్పులు అమలులోకి రానున్నాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో విద్యుత్ బిల్లుల భారం నుంచి ప్రజలకు ఉపశమనం లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. టైం ఆఫ్ డే టారిఫ్ సిస్టం అంటే ఒక రోజులో వివిధ సమయాల్లో వాడే విద్యుత్ కి వివిధ ధరలు ఉంటాయి. అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఇలా ఆయా సమయాన్ని బట్టి యూనిట్ రేటు అనేది మారుతుంది. ఉదయం యూనిట్ ధర ఒకలా ఉంటే, సాయంత్రం మరొకలా ఉంటుంది. ఎక్కువ విద్యుత్ డిమాండ్ ఉన్న సమయంలో మనం ఎక్కువ విద్యుత్ ని వాడితే ఆ సమయంలో యూనిట్ రేటు అనేది ఎక్కువ ఉంటుంది.
ఇప్పుడు దీన్ని ప్రభుత్వం మార్చనుంది. రోజంతా ఎంత వాడినా గానీ, ఏ సమయంలో అయినా సరే ఒకే యూనిట్ కాస్ట్ ఉండాలని నిర్ణయం తీసుకుంది. ఈ టారిఫ్ సిస్టం గరిష్ట విద్యుత్ డిమాండ్ 10 కిలో వాట్లు అంతకన్నా ఎక్కువగా ఉండే కమర్షియల్, ఇండస్ట్రియల్ వినియోగదారులకు 2024 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది. వ్యవసాయ వినియోగదారులకు ఈ సిస్టం వర్తించదు. డొమెస్టిక్ వినియోగదారులకు 2025 ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త టారిఫ్ సిస్టం అమలు కానుంది. టైం ఆఫ్ డే టారిఫ్ సిస్టం పరిధిలోకి వచ్చే పవర్ టారిఫ్ సోలార్ హవర్స్ లో 20 శాతం తక్కువగా ఉంటుంది. అలాగే పీక్ హవర్స్ లో అంటే డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయాల్లో 10 నుంచి 20 శాతం ఎక్కువగా ఉంటుంది. టైం ఆఫ్ డే నియమాలను ఖచ్చితంగా పాటించే వారికి ప్రయోజనాలు ఉంటాయని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఈ టైం ఆఫ్ డే టారిఫ్ సిస్టంతో వినియోగదారులు తమ కరెంట్ బిల్లును తగ్గించుకోవచ్చునని, అలానే విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థలు వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవచ్చునని తెలిపింది. పునరుత్పాదక ఇంధన వనరులకు గ్రిడ్ కు అనుసంధానం చేసేందుకు, వేగంగా విద్యుత్ ని ట్రాన్స్ ఫర్ చేసేందుకు కావాల్సిన వ్యవస్థను ఈ ఎలక్ట్రిసిటీ రూల్స్ 2020 అందిస్తుంది. మీటరింగ్ నియమాల్లో చేసిన సవరణల ప్రకారం.. స్మార్ట్ మీటర్ ఇన్ స్టాల్ చేసిన తర్వాత విద్యుత్ వినియోగదారులపై ఎలాంటి పెనాల్టీ పడదు. స్మార్ట్ మీటర్ పెట్టక ముందు గరిష్ట డిమాండ్ ను రికార్డ్ చేస్తారు కాబట్టి పెనాల్టీ పడే అవకాశం ఉండదని కేంద్రం వెల్లడించింది. వినియోగదారుల సాధికారతకు, నాణ్యమైన విద్యుత్ ని 24×7 అందించేందుకు ఎలక్ట్రిసిటీ రూల్స్ లో సవరణలు తీసుకురావడం జరిగిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
INDIA GOVT: AMENDS ELECTRICITY (RIGHTS OF CONSUMERS) RULES, 2020 BY INTRODUCING TIME OF DAY TARIFF AND SIMPLIFICATION OF SMART METERING RULES#GENUSPOWER#hblpower
— RedboxGlobal India (@REDBOXINDIA) June 23, 2023