పలు రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని గుర్తించి గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం పద్మ అవార్డులతో సత్కరిస్తుంది. 2022వ సంవత్సరానికి సంబంధించి పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 106 పద్మ అవార్డులను రాష్ట్రపతి ఆమోదించారు. 6 పద్మ విభూషణ్, 9 పద్మ భూషణ్, 91 మందిని పద్మశ్రీ పురస్కారాలతో సత్కరించనున్నారు. వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. వైద్య విద్యా రంగంలో పేద ప్రజలకు ఉచిత సేవలు అందించినందుకు గానూ.. కాకినాడకు చెందిన సంకురాతిరి చంద్రశేఖర్ ను పద్మశ్రీ అవార్డు వరించింది. గిరిజన భాషలను పరిరక్షించినందుకు గానూ.. తెలంగాణకు చెందిన బి.రామకృష్ణారెడ్డిని పద్మశ్రీతో సత్కరించనున్నారు. ఆర్ట్స్ విభాగంలో ఎంఎం కీరవాణికి కూడా పద్మశ్రీ పురస్కారం అందించనున్నారు.
పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓఆర్ ఎస్ సృష్టికర్త దిలీప్ మహాలనబిస్ పద్మ విభూషణ్ కు ఎంపికయ్యారు. ఈయన సృష్టించిన ఓఆర్ఎస్ ద్వారా దాదాపు ఒక 5 కోట్ల మంది ప్రాణాలు కాపాడి ఉంటారని ప్రభుత్వం విడుదల చేసిన ఓ నివేదికలో తెలిపారు. ఆయన గతేడాది అక్టోబర్ నెలలో కాలం చేశారు. దివంగత నేత ములాయం సింగ్ యాదవ్ కు పద్మ విభూషణ్ ప్రకటించారు. ఇంక పద్మశ్రీ అందుకున్న వారిలో గాంధేయవాది.. అట్టడుగు వర్గాల ప్రజలను అభివృద్ధి పదంలో నడిపేందుకు కొన్నేళ్లుగా కృషి చేస్తున్న వీపీ అప్పుకుట్టన్ పొడువల్ ను పద్మశ్రీ వరించింది. ప్రొఫెషనల్ స్నేక్ కాచెర్స్ వడివేల్ గోపాల్, మసి సడయాన్ లను కూడా పద్మశ్రీతో సత్కరించనున్నారు. సిక్కింకి చెందిన 98 ఏళ్ల ఆర్గానిక్ రైతు తులారాం ఉప్రేటీని పద్మశ్రీతో సత్కరించనున్నారు. ఇంకా పలువురిని దేశంలోని నాలుగవ అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీతో సత్కరించనున్నారు.
For 2023, the President has approved conferment of 106 Padma Awards incl 3 duo cases. The list comprises 6 Padma Vibhushan, 9 Padma Bhushan & 91 Padma Shri. 19 awardees are women & the list also includes 2 persons from category of Foreigners/NRI/PIO/OCI and 7 Posthumous awardees pic.twitter.com/Gl4t6NGSzs
— ANI (@ANI) January 25, 2023