ఈ మద్య ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ అనేది సర్వ సాధారణం అయ్యింది. ఒక పూట తిండి లేకుండా ఉండగలుగుతారు కానీ.. చేతిలో స్మార్‌ఫోన్ లేనిదే మాత్రం ఉండలేకపోతున్నారు. ఫోన్ తో ఎన్ని ఉపయోగాలు ఉన్నా.. కొన్నిసార్లు వాటితో ప్రమాదం పొంచి ఉంటుంది. ఇటీవల స్మార్ట్‌ఫోన్‌లు పేలుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఓ కస్టమర్ కి సెల్ ఫోన్ చూపిస్తున్న సమయంలో ఉన్నట్టుండి పేలిపోయింది. భయం పుట్టిస్తున్న ఈ బాలాఘాట్‌లోని ‘బంటీ మొబైల్ షాప్’లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో ఓ సెల్ ఫోన్ షాపుకి కస్టమర్ వచ్చాడు. షాప్‌కి వచ్చిన ఓ కస్టమర్‌తో మాట్లాడుతూ షాప్ యజమాని సెల్‌ఫోన్ ఆన్ చేసి చూపించడానికి ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా బ్యాటరీ పేలిపోయింది. పెద్ద శబ్దంతోపాటు మంటలు కూడా ఎగసిపడ్డాయి. వెంటనే ఆ సెల్ ఫోన్ పక్కకు విసరగా.. అక్కడ కూడా మంటలు అంటుకున్నారు. దాంతో సెల్ ని బయటకు విసిరాడు షాపు యజమాని. ఒక్కసారే సెల్ ఫోన్ పేలడంతో కస్టర్ భయంతో అక్కడ నుంచి పరుగులు తీశాడు.
ఈ ఘటన ‘బంటీ మొబైల్ షాప్’లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడం.. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై షాప్ ఓనర్ బంటీ స్పందిస్తూ… తాను ఫోన్ తీసి ఆన్ చేయగానే ఒక్కసారే పెద్ద శబ్ధంతో పెలిపోయిందని.. వెంటనే పక్కకు విసిరేయడంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదని చెప్పాడు. మీ సెల్‌ఫోన్ ఉబ్బినట్టు అనిపిస్తే బ్యాటరీ ప్రాబ్లమ్ అని.. దాన్ని వెంటనే రిపేర్ షాప్‌కు తీసుకెళ్లాలని బంటీ సూచించాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
युवक के हाथ में फटा मोबाइल फोन, कैमरे में कैद हुई घटना.. pic.twitter.com/y2TyVxoSNu
— @kumarayush21 (@kumarayush084) August 18, 2022