ఈ పాండేషన్ వద్ద ఎంతో మంది సెలబ్రెటీలు సందడి చేశారు. ఈషా ఫాండేషన్ ఆధ్వర్యంలో శివరాత్రి వేడుకలు ప్రతీ ఏడాది ఘనంగా జరుగుతాయి. ఈ వేడుకలకు ఎంతోమంది సెలబెట్రీలు, కళాకారులు, ప్రముఖులు పాల్గొంటారు.
తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న ఈ పాండేషన్ వద్ద ఎంతో మంది సెలబ్రెటీలు సందడి చేశారు. ఈషా ఫాండేషన్ ఆధ్వర్యంలో శివరాత్రి వేడుకలు ప్రతీ ఏడాది ఘనంగా జరుగుతాయి. ఈ వేడుకలకు ఎంతోమంది సెలబెట్రీలు, కళాకారులు, ప్రముఖులు పాల్గొంటారు. ఈషా ఫాండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ ఆధ్వర్యంలో ప్రతీ ఏడాది ఇక్కడ శివరాత్రి వేడుకలు జరుగుతాయి.
ప్రతీ ఏడాదిలాగే ఈాసారి కూడా వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇకపోతే శనివారం సాయంత్రం ప్రారంభం కానున్న ఈ వేడుకు ఆదివారం తెల్లవారుజామున వరకు కొనసాగుతుంది. ఈ వేడుకలలో ఎంతో మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకుంటారు. మరీ ముఖ్యంగా ఈ శివరాత్రి వేడుకకు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ సెలబ్రెటీలు హాజరవుతూ ఉంటారు. ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న ఈషా పాండేషన్ కు చేరుకున్నారు.
అయితే మై విలేజ్ షో ద్వారా ఎంతోమందికి పరిచయమైన గంగవ్వ కూడా ఈషా ఫాండేషన్ వద్దకు చేరుకున్నారు. మై విలేజ్ షో అనిల్ తో పాటు వారి టీమ్ లోకి కొందరు అక్కడికి చేరుకుని జగ్గీ వాసుదేవును కలుసుకున్నారు. అయితే జగ్గీ వాసుదేవ్ మాత్రం గంగవ్వను ఎంతో అప్యాయంగా పలకరించారు. ఇక వీరితో పాటు బిగ్ బాస్-4లో కంటెస్టెంట్ గా పాల్గొన్న దివి సైతం అప్పటికే ఈషా ఫాండేషన్ కు చేరుకుంది.ఈమెతో పాటు హీరోయిన్ ప్రగ్య జైశ్వాల్, దెత్తడి హారిక వంటి ప్రముఖ సెలబ్రెటీలు అక్కడికి చేరుకుని సందడి చేశారు. అయితే ఈ సెలబ్రెటీలంతా అక్కడున్న ఆది యోగి విగ్రహం దగ్గర ఫొటోలు తీసుకుని తమ తమ ఇన్ స్టాలో పోస్ట్ చేసుకున్నారు. ఇప్పుడు అవే ఫొటోలు కాస్త వైరల్ గా మారాయి. సాయంత్రం ప్రారంభం కానున్న ఈ వేడుకను తిలకించేందుకు ఎంతోమంది ఎదురుచూస్తున్నారు.