ఒక వ్యక్తి తను చేసే కృషి జీవితంలో ఉన్నతమైన స్థితిలో ఉండడానికి కారణమవుతది. సమాజంలోని ప్రముఖులందరు కూడా వారు చేసే పనిపట్ల అంకితభావం, శ్రద్ద కనబరుస్తూ తమకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పర్చుకుంటారు.
ఒక వ్యక్తి తను చేసే కృషి జీవితంలో ఉన్నతమైన స్థితిలో ఉండడానికి కారణమవుతది. సమాజంలోని ప్రముఖులందరు కూడా వారు చేసే పనిపట్ల అంకితభావం, శ్రద్ద కనబరుస్తూ తమకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పర్చుకుంటారు. సినిమా రంగం, రాజకీయం, బిజినెస్ రంగాలకు చెందిన వారు వృత్తే లోకంగా జీవిస్తుంటారు. ఈ కోవలో పురుషులతో పాటు మహిళలు కూడా ఊహించని రీతిలో రాణిస్తూ దూసుకెల్తున్నారు. వంటింటి నుంచి అంతరిక్షం వరకు అన్నిరంగాల్లో తమదైన ముద్ర వేస్తున్నారు. పై ఫొటోలో ఉన్న మహిళ కూడా సాధారణ సేల్స్ వుమన్ గా జీవితాన్ని ప్రారంభించి నేడు మహిళాలోకం గర్వించే స్థాయిలో గుర్తింపు పొందుతోంది.
కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్ లో మంత్రిగా పనిచేస్తూ.. భారత రాజకీయాల్లో ప్రభావవంతమైన పదవులను చేపట్టి తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పర్చుకుంది. ఆమె మరెవరో కాదు.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆమె తమిళనాడులోని మధురైలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో 1959 ఆగస్టు 18న జన్మించారు. ఆమె తల్లి సావిత్రి సీతారామన్. తండ్రి నారాయణ్ సీతారామన్. పూర్తి కాలం మహిళా ఆర్థిక మంత్రిగా పనిచేసిన మొదటి మహిళ నిర్మలా సీతారామన్. సాధారణ సేల్స్ వుమన్ నుంచి కేంద్ర ఆర్థిక మంత్రిగా ఆమె ఎదిగిన తీరు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. నిర్మలా సీతారామన్ వివాహం ఏపీకి చెందిన రాజకీయ, టీవీ యాంకర్ పరకాల ప్రభాకర్ తో జరిగింది. వీరికి ఒక కుమార్తె పరకాల వాజ్ఞ్మయి.