రాత్రి 2 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సులోని 25 మంది మంటల్లో సజీవంగా దహనమయ్యారు. మిగతా ప్రయాణికులను చికిత్స కొరకు ఆస్పత్రికి తరలించారు.
ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణణీయంగా పెరిగింది. రహదారిపై అనేక ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. సాధారణంగా వాహనాలు ఒకదానికొకటి గాని, పాదచారుల్ని లేదా ఏదైనా జంతువులు గాని ఢీకొట్టినప్పుడు ప్రమాదాలు జరుగుతాయి. డ్రైవర్లు మద్యం సేవించి వాహనాన్ని నడపడం ద్వారా ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. మరో కారణం నిర్లక్ష్యం, అతివేగంతో చాలా ప్రమాదాలు జరుగుతాయి. త్వరగా గమ్యస్థానాలకు చేరాలనే ఆతృతతో వేగంగా వెళ్తుంటారు అటువంటి సమయంలో పరిమితికి మించి వేగంతో వాహనాలు నడపడం వల్ల కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. ప్రమాదాలను నివారించే దిశలో అధికారులు ఎప్పటికప్పుడు భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. అయినాకూడా రోడ్డు ప్రమాదాలను తగ్గడం లేదు.
తాజాగా మహారాష్ట్రలో రాత్రి 2 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సులోని 25 మంది మంటల్లో సజీవంగా దహనమయ్యారు. మిగతా ప్రయాణికులను చికిత్స కొరకు ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. రన్నింగ్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి 25 మంది ప్రయాణికులు సజీవదహనం అయిన ఘటన చోటు చేసుకుంది. నాగ్ పూర్ నుండి పుణె వెళ్తుండగా రాత్రి 2గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. టైర్ పేలడంతో బస్సు అదుపు తప్పినట్లు తెలుస్తుంది.
ఈ ప్రమాదంలో 25 మంది సజీవ దహనం కాగా 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. బుల్ధానాలోని సమృద్ధి మహామార్గ్ లో ఘటన చోటు చేసుకుంది. బస్సు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.