కరెన్సీని ఎవరైనా కష్టపడి సంపాదించాలి. కానీ, కొందరు మాత్రం సరదాగా కొన్ని కలలు కంటుంటారు. డబ్బు చెట్లకు కాయచ్చు కదా, ఆకాశం నుంచి నోట్లు వర్షంలా కురవచ్చు కదా అంటూ కోరుకుంటారు. అయితే అవన్నీ ఎప్పటికీ నిజం కావు. కానీ, దాదాపుగా అలాంటి ఒక ఘటనే ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.
సాధారణంగా డబ్బుల విషయంలో చాలా జోకులు వేస్తుంటారు. డబ్బులు చెట్లకి కాస్తే బాగుండు, ఆకాశం నుంచి నోట్ల వర్షం కురిస్తే బాగుండు అంటూ చెప్పుకుంటూ ఉంటారు. నిజానికి అలా జరగదని వారికీ తెలుసు. కానీ, అలా జరిగితే బాగుండు కదా అని భావిస్తుంటారు. అయితే డబ్బుల విషయంలో ఇంచుమించు అలాంటి ఒక ఊహే నిజమైంది. కుప్పలు తెప్పలుగా డబ్బుల కట్టలు వచ్చి పడ్డాయి. మురుగు కాల్వలో కట్టలు కట్టల కరెన్సీ దర్శనమిచ్చింది. అది చూసిన స్థానికులకు కాసేపు బుర్ర పని చేయలేదు. తేరుకున్న తర్వాత వాటిని దక్కించుకునేందుకు పోటీ పడ్డారు. కొందరు అయితే వంతెన పైనుంచి కాల్వలోకి దూకేశారు.
కథనాల ప్రకారం.. ఈ విత ఘటన బిహార్ లో జరిగింది. ససారం జిల్లా మొరదాబాద్ లోని ఓ నీటి కాల్వలో నోట్ల కట్టలు ప్రత్యక్ష మయ్యాయి. ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు కరెన్సీ కట్టలు కొట్టుకొచ్చాయి. కొందరు మొదట కాల్వ దగ్గరకు వెళ్లి చూశారు. అవి కరెన్సీ కట్టలు అని తెలిసి వారికి కాసేపు ఏమీ అర్థం కాలేదు. అన్నీ రూ.100, రూ.200, రూ.500 నోట్లే ఉన్నాయి. వెంటనే వాటిని దక్కించుకోవాలని ప్రయత్నించారు. కొద్దిసేపటికే ఆ వార్త ఊరు మొత్తం వ్యాపించింది. స్థానికులు కుప్పలు తెప్పలుగా అక్కడికి చేరుకున్నారు. ఒక వ్యక్తి అయితే బ్యాగు తీసుకుని వంతెన పైనుంచి కాల్వలోకి దూకేశాడు.
ఇంకొదరు వారి చొక్కాలను విప్పి దొరికిన నోట్ల కట్టలను వాటిలో పెట్టుకున్నారు. ఎవరికి దొరికినంత వాళ్లు పోగేసుకున్నారు. అయితే అవి నిజమైన నోట్లా? నకిలీ నోట్లా? అనే విషయంపై స్పష్టత రాలేదు. స్థానికులు మాత్రం అవి నిజమైన నోట్లనే చెబుతున్నారు. ఈ విషయం పోలీసులకు కూడా తెలిసింది. వెంటనే వాళ్లు కూడా ఘటనాస్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే అంతా అయిపోయింది. అక్కడ వారికి ఎలాంటి కరెన్సీ నోట్లు దొరకలేదు. అసలు అవి అక్కడికి ఎలా వచ్చాయి? ఎవరైనా వాటిని కాల్వలో పడేశారా? అసలు అవి నిజమైన నోట్లేనా? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే స్థానికులు మాత్రం ఈ ఘటనపై నోరు విప్పడం లేదని చెబుతున్నారు.
#Bihar:Hugh Amount of Notes found thrown in the canal in Bihar’s #Sasaram.
There was a competition to loot the bundle of cash.A/C to the Police they reached at the spot and tried to inquire but could not find anything.@AsmeetonGround Video pic.twitter.com/CdrRtRy5QY
— Siraj Noorani (@sirajnoorani) May 6, 2023