భారత సరిహద్దుల్లో పహారా కాస్తున్న సైనికులు ఎంతో కఠినంగా ఉంటారు. కొన్నిసార్లు పొరబాటున సరిహద్దు ధాటి భారత్ లోకి ప్రవేశిస్తుంటారు పాకిస్థాన్ దేశస్తులు. వారి వివరాలు పూర్తిగా తెలుసుకొని అనుమానించదగ్గ వ్యక్తులు కాదని నిర్ధారించుకున్న తర్వాత పాకిస్థాన్ కి అప్పగిస్తుంటారు భారత సైనికులు. గతంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. సరిహద్దుల గురించి తెలియన పాక్ కి చెందిన ఓ బాలుడు భారత భూభాగంలోకి అడుగు పెట్టాడు. దీంతో ఆ బాలుడి వివరాలు తెలుసుకొని తండ్రిని పిలిపించి అప్పగించారు. వివరాల్లోకి వెళితే..
పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దుకి శుక్రవారం ఏడుగంటల ప్రాంతంలో పాకిస్థాన్ బాలుడు వచ్చాడు. నాన్నా అంటూ గుక్కపెట్టి ఏడవడం మొదలు పెట్టాడు. దీంతో ఆ బాలుడిని బీఎస్ఎఫ్ దళాలు గమనించి వెంటనే అలర్ట్ అయి బాబుని అదుపులోకి తీసుకున్నారు. ఆ బాలుడు బాగా ఆకలితో ఉండటం చూసి మంచినీళ్లు, తినడానికి చిప్స్ ఇచ్చారు. ఆ తర్వాత పాక్ రేంజర్స్ కి సమాచారం అందించారు.
రాత్రి తొమ్మిదిగంటల ప్రాంతంలో పాక్ రేంజర్ ఆఫీసర్ సమక్షంలో బాలుడి తండ్రిని పిలిపించి అప్పగించారు. పాక్ శత్రుదేశం అయినా చిన్న పిల్లాడి విషయంలో మన సైనికులు చూపించిన మానవత్వం ఎంతో గొప్పదని ఈ విషయం తెలిసిన నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది చదవండి: SpiceJet Flight: 5 వేల అడుగుల ఎత్తులో విమానం.. క్యాబిన్ లో పొగలు.. బెంబేలెత్తిన ప్రయాణికులు
On 1st July, troops of 182 Bn BSF, Ferozepur Sector handed over a 3-yr-old child, who had crossed the border to the Indian side inadvertently, to Pakistan Rangers as a goodwill gesture. The child was apprehended at about 7:15 pm & handed over at 9:45 pm: PRO, Punjab Frontier, BSF pic.twitter.com/lSbwV7g7No
— ANI (@ANI) July 2, 2022