ఏ వివాహంలో అయినా..పెళ్లి ఘడియలు మొదలు అయ్యే సమయానికి ఆనందంతో పాటు రకమైన గందర గోళ పరిస్థితులు, ఏదో తెలియని భావం అటు వధూవరులతో పాటు వారి తల్లిదండ్రులనూ వెంటాడుతూ ఉంటుంది. తాళి కట్టే సమయంలో పెళ్లి కుమార్తె ఆనందంతో ఏడ్చిన సందర్భాలున్నాయి. కానీ ఈ పెళ్లి వేదికపై ఏం జరిగిందంటే..?
పెళ్లి అనేది ఓ అద్భుతమైన వేడుక. ప్రతి ఒక్కరి జీవితంలో ఓసారి మాత్రమే వస్తుంది. పెళ్లి ఈడు వచ్చిన అమ్మాయి, అబ్బాయిల తల్లిదండ్రులు .. వారి పిల్లలకు సరైన జోడిని వెతికి పనిలో బిజీగా ఉంటారు. వారికో జీవితాన్ని ఇచ్చేందుకు సంబంధాలు చూడటం మొదలు పెడతారు. ఇరు పక్షాలు పెళ్లి అనుకున్నాక.. వివాహ వేడుక కోసం పెళ్లి కుమారుడు, కుమార్తె ఎన్నో కలలుకంటారు. అదే ప్రేమ పెళ్లి అయితే ఆ ఆనందమే వేరు. ఇష్టమైన వారిని మనువాడ బోతున్నామన్న ఆనందం వధూవరుల మొహల్లో కనిపిస్తుంది. ఏ వివాహంలో అయినా..పెళ్లి ఘడియలు మొదలు అయ్యే సమయానికి ఆనందంతో పాటు రకమైన గందర గోళ పరిస్థితులు, ఏదో తెలియని భావం అటు వధూవరులతో పాటు వారి తల్లిదండ్రులనూ వెంటాడుతూ ఉంటుంది.
బంధు, మిత్రుల హడావుడి, కుశల ప్రశ్నలు, పలకరింపులతో మనస్సు పులకరిస్తోంది. ఒక్కో సమయంలో దాన్ని ఆనంద బాష్పాలుగా చూపిస్తుంటారు. ఇక తాళి కట్టే సమయానికి పెళ్లి కుమార్తె ఏడ్వటం చాలా సందర్భాల్లో చూశాం. అటువంటి అరుదైన దృశ్యాలకు వెలకట్టలేం. అటువంటి ఘటనే ఓ పెళ్లి పందిరిలో ఆవిష్కృతమైంది. ఇంతకూ ఆ పందిట్లో ఏడ్చిందీ..అమ్మాయో, లేదా అత్తవారింటికి వెళ్లిపోతుందనీ వధువు తల్లిదండ్రులు అనుకునేరూ. అయితే మీరు పప్పులో కాలు వేసినట్లే. ఆ ఏడ్చింది వధూవరులు. అవును.. వారిద్దరూ ఏడ్వడం, దాన్ని వీడియో తీసి నెట్టింట్లో పెట్టడంతో, అది కాస్తా వైరల్‌గా మారిపోయింది. ఇద్దరు ఒకరి నొకరు చూసుకుంటూ ఏడ్వడం ఆ వీడియోలో కనిపిస్తోంది. ఇద్దరూ చిన్న పిల్లలా వెక్కి వెక్కి ఏడ్చారు. రిసెప్షన్ వేదికపై ఉండగానే ఈ ఘటన చోటుచేసుకుంది.
అయితే తెలిసిన వివరాల ప్రకారం.. చాలా ఏళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. చాలా కాలం పెద్దల్ని ఒప్పించి ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. తమ ప్రేమ పెళ్లి పీటలు ఎక్కిందన్న ఆనందంతో వధూవరులిద్దరూ భావోద్వేగానికి లోనయ్యారు. ఇద్దరూ స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. మొదట వరుడి కళ్లలో నీళ్లు రావడం వీడియోలో కనిపిస్తుంది.. కానీ, ఏం జరుగుతోందని అడగడంతో పెళ్లికూతురు కూడా ఏడవడం మొదలుపెట్టింది. పైగా వధువు కూడా ఏడుస్తూనే వరుడిని ఓదార్చడం చూసి అక్కడి వారంతా ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ చూసి కామెంట్ల రూపంలో తెలియజేయండి.