అమ్మాయి ఉండేది ఎక్కడో ఇంగ్లాండ్ లో. నర్స్ గా పనిచేస్తుంది. అబ్బాయి ఉండేది ఇండియాలో ఎక్కడో మారుమూల పల్లెటూరులో ఉంటాడు. ఈ అబ్బాయి కోసం ఇంగ్లాండ్ లో ఉన్న అమ్మాయి ఇండియా వచ్చింది. అంతేకాదు అతన్ని పెళ్లి చేసుకుంది. అతని కోసం తన ఇష్టాలను, కల్చర్ ను మార్చుకుంది. ఈరోజుల్లో ప్రేమించిన వ్యక్తి కోసం కట్టుకున్న బట్టలనే మార్చుకోవడం లేదు అమ్మాయిలు. అలాంటిది విదేశీ యువతి ఏకంగా తన కల్చర్ ని వదులుకుని వచ్చింది. ఎవరా అమ్మాయి? అసలు ఇంగ్లాండ్ యువతికి, ఇండియా అబ్బాయికి మ్యాచ్ ఎలా సెట్ అయ్యింది? ఈ ఇద్దరూ ఎలా కలుసుకున్నారు? ఆ స్టోరీ ఏంటో ఓ లుక్కేయండి.
సోషల్ మీడియా మనుషులు, మనసులు కలవడం కోసం ఏర్పడిన ఒక డిజిటల్ వంతెనలా మారింది. మనం ఎక్స్ప్రెస్ చేయాలనుకున్న మాటలు క్షణాల్లో అవతల వ్యక్తులకు చేరిపోతున్నాయి. ఇలాంటి సొసైటీ ఆఫ్ వరల్డ్ లో ఉన్న మనుషులకి.. ప్రపంచంలో ఏ మూలన ఉన్న వ్యక్తులతో అయినా సంబంధాలు ఇట్టే సెట్ అయిపోతున్నాయి. ఈ తరహాలోనే ఇంగ్లాండ్ దేశస్తురాలైన హన్నా హెవిట్, ఇండియాకి చెందిన పలేంద్ర సింగ్ ఒకటయ్యారు. ఇండియాలో ఆగ్రాలో పల్లెటూరులో ఉండే పలేంద్ర సింగ్ (28) అనే వ్యక్తిని.. ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ లో నర్స్ గా పనిచేసే బ్రిటిష్ యువతి పెళ్లి చేసుకుంది. బమ్రౌలీ కటర అనే గ్రామంలో ఉండే శివశక్తి ఆలయంలో పలేంద్ర సింగ్, హన్నాల వివాహ వేడుక జరిగింది. హిందూ సాంప్రదాయం ప్రకారం పలేంద్ర సింగ్ ని గుడిలో పెళ్లి చేసుకుంది. భర్తతో కలిసి ఏడడుగులు నడిచింది.
పలేంద్ర సింగ్ ఆగ్రాలో ఒక ప్రైవేట్ సంస్థలో సేల్స్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. కోవిడ్ మొదటి వేవ్ సమయంలో పలేంద్ర సింగ్ సోషల్ మీడియాలో పాడ్ క్యాస్ట్ ప్రారంభించాడు. అదే సమయంలో ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ కి చెందిన హన్నా అనే యువతి.. పాడ్ క్యాస్ట్ ద్వారా పలేంద్ర సింగ్ ని సంప్రదించింది. అలా ఇద్దరికీ పరిచయం కాస్తా స్నేహంగా మారింది. ఒకరి ఇష్టాయిష్టాలు మరొకరితో పంచుకున్నారు. తమ కల్చర్ గురించి మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఈమెయిల్ ఐడీ, టెలిగ్రామ్ ద్వారా స్నేహించుకోవడం మొదలుపెట్టారు. అది ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కోవిడ్ సంక్షోభం ముగిసిన తర్వాత వివాహం చేసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు.
A British nurse got married to an #Agra villager after meeting on social media
By Siraj Qureshihttps://t.co/uSbTv9qbXw
— IndiaToday (@IndiaToday) November 8, 2022
కోవిడ్ సంక్షోభం ముగిసిన చాలా కాలం తర్వాత ఈ సోమవారం ఇద్దరూ ఒకటయ్యారు. పలేంద్ర సింగ్ కోసం భారతీయ జీవన విధానానికి తగట్టు తనను తాను మలచుకుంటానని చెబుతుంది. అంతేకాదు హిందీ కూడా నేర్చుకుంటానని ఆమె అంటోంది. ఇక పలేంద్ర సింగ్ ది రైతు కుటుంబ నేపథ్యం. ఆయన తండ్రి ఒక రైతు. సోదరుడు పోలాండ్ లో పని చేస్తున్నాడు. ఏది ఏమైనా గానీ 200 ఏళ్ల క్రితం మనల్ని పాలించిన బ్రిటిష్ దేశంలో పుట్టిన వాళ్ళు.. ఇప్పుడు భారతదేశాన్ని, భారతీయుల్ని గౌరవించడం, ప్రేమించడం అనేది శుభ పరిణామంగా చెప్పుకోవాలి. దీనికి నిదర్శనం ఇటీవల భారతీయ సంతతికి చెందిన రిషి సునాక్ ని యూకే ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టడమే.