ఈ మద్య సోషల్ మీడియాలో చిత్ర విచిత్రమైన వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. కొన్ని కన్నీరు పెట్టించే విధంగా ఉంటాయి.. మరికొన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. ఇటీవల కాలంలో పెళ్లికి సంబంధిచిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని వీడియోల్లో వధువరుల డ్యాన్సులు ఉంటే.. మరికొన్ని వాటిల్లో పొట్టచెక్కలయ్యే ఫన్నీ సన్నివేశాలుంటాయి. పెళ్లి మండపం మీద పెళ్లి కొడుకును.. పెళ్లి కూతురు చితకబాదింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మండపంలో అందరి బంధువుల సమక్షంలో పెళ్లి తంతు ఎంతో ఘనంగా జరుగుతుంది. వధూవరుల బంధువులతో పెళ్లి మండపం సందడిగా ఉంది. వివాహ కార్యక్రమంలో పలు ఆచార సాంప్రదాయాలు ఉంటాయి. ఈ క్రమంలో పెళ్లి ఆచారంలో భాగంగా వరుడు తన చేతిని ముందుకు చాచడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలోపెళ్లి కూతురు అనుహ్యంగా పెళ్లికొడుకుపై దాడి చేసింది. దీంతో ఇద్దరి మద్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. అంతేకాదు వధువు తన స్థానంలో నుంచి లేచి వరుడిపై తీవ్రంగా దాడి చేసింది.
ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితిలో పడ్డారు ఇరువురి బంధువు వర్గం. బంధువులు వీరి గొడవను ఆపేందుకు ప్రయత్నించగా.. పెళ్లి కూతురు మరింత ఆవేశంగా వరుడిపై దాడి చేసింది. అయితే వారిద్దరి మధ్య ఎందుకు గొడవ జరిగిందనే విషయం మాత్రం క్లారిటీ లేదు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోకు నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.