కుర్రాళ్లకు బైకులు, కారులు ఇస్తే ఆగుతారా.. తమను ఆపేదెవరూ అంటూ రయ్ రయ్ అంటూ దూసుకెళిపోతుంటారు. జాతీయ రహదారుల నుండి చిన్న చిన్న వీధుల్లో కూడా స్పీడుగా దూసుకెళుతుంటారు. గాల్లో తేలిపోతూ విహరిస్తుంటారు.
అప్పుడే నూనుగు మీసాలు వచ్చిన కుర్రాళ్లకు బైకులు, కారులు ఇస్తే ఆగుతారా.. తమను ఆపేదెవరూ అంటూ రయ్ రయ్ అంటూ దూసుకెళిపోతుంటారు. జాతీయ రహదారుల నుండి చిన్న చిన్న వీధుల్లో కూడా స్పీడుగా వెళిపోతుంటారు. గాల్లో తేలిపోతూ విహరిస్తుంటారు. ఇక అమ్మాయిలు కనబడ్డారో ఇక అంతే సంగతులు వారి ముందు రెచ్చిపోతూ బైక్సుతో స్కిట్లు, విన్యాసాలు, సర్కస్ ఫీట్లు చేస్తుంటారు. అయితే ఒక్కోసారి ఇవి ప్రమాదానికి దారి తీస్తూ, ఇతరుల ప్రాణాల మీదకు తెచ్చిపెడుతుంటాయి. వీరూ చేస్తున్న వ్యవహారాలు తల్లిదండ్రులకు బాధను కలిగిస్తున్నాయి. మందలిస్తున్నప్పటికీ పెడదోవలోనే నడుస్తున్నారు కొందరు. హైదరాబాద్ నగరంలో ఇప్పడు అదే జరుగుతోంది.
బైక్ చేతిలో ఉందా, పోరీతో కలిసి రోడ్డపై చక్కర్లు కొడుతున్నారు. ప్రమాదకర రీతిలో స్టంట్స్ చేస్తూ వాహనదారులను భయాందోళనలు కలిగిస్తున్నారు. వీకెండ్స్ తో పాటు అర్థరాత్రుళ్లు స్నేహితులతో లేదా అమ్మాయిలను ఎక్కించుకుని రహదారులపై విన్యాసాలు చేస్తున్నారు. మాసబ్ ట్యాంక్, బంజారా హిల్స్, అత్తాపూర్, కేబుల్ బ్రిడ్జి ప్రాంతాల్లో ఈ ఘటనలు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. ఈ విన్యాసాలను చూస్తున్న పోలీసులు కూడా వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఓ యువకుడు సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో పోలీసుల ముందు ఓ యువకుడు విన్యాసాలు చేయడం కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.