తను ప్రేమించిన యువతి అలగడంతో తన అలకను తీర్చేందుకు ఓ యువకుడు వినూత్నంగా ఆలోచించాడు. తను చేసిన ఆ పనికి అందరు ఆశ్చర్చపోతున్నారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం అని ఓ తెలుగు సినిమాలో ఇద్దరు ప్రేమికుల మధ్య చోటచేసుకున్న సంఘటనలను పాటరూపంలో వివరించిన విషయం తెలిసిందే. ఇదే విధంగా భార్యాభర్తల మధ్య, ప్రేమికుల మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న అలకలు చోటుచేసుకుంటాయి. ప్రియురాలి అలకను తీర్చడానికి ఆ ప్రియుడు నానా ప్రయత్నాలు చేసి ఆమె అలకను తీరుస్తాడు. బుజ్జగించో, గిఫ్ట్స్ ఇచ్చో ఆ ప్రియురాలి ప్రేమను ప్రసన్నం చేసుకుంటాడు. ఇదే రీతిలో ఓ యువకుడు ఓ అడుగు ముందుకేసి అలిగిన ప్రియురాలి అలక తీర్చేందుకు వినూత్నంగా ఆలోచించాడు. తాను చేసిన ఆ పని పలువురిని ఆకట్టుకుంటుంది.
ఎంతటి గాఢ ప్రేమికులైనా సరే ప్రియుడు, ప్రియురాలి మధ్య చిన్న చిన్న అలకలు, గొడవలు సాధారణంగా చోటుచేసుకుంటాయి. గొడవ పడిన తర్వాత ప్రియురాలు అలగడం, మాట్లాడకుండా ఉండి బెట్టు చేయడం సాదారణంగా జరిగే విషయమే. ఆ ప్రియురాలి అలకను పోగొట్టేందుకు ప్రియుడు సారీ చెప్పడం ఇదంతా కామన్ గా జరుగుతూ ఉండేదే. కానీ ఢిల్లీ లోని నోయిడాలో ఓ ప్రియుడు చేసిన పని ప్రేమికులతో పాటుగా సోషల్ మీడియా కూడా ఫిదా అయిపోయింది. చిన్న వివాదం కారణంగా అలిగిన ప్రియురాలికి సారీ చెప్పేందుకు ఓ యువకుడు నోయిడాలో భారీ హోర్డింగ్ ను ఏర్పాటు చేశాడు.
దానిపై నన్ను క్షమించు సంజు.. ఇంకెప్పుడు నిన్ను బాధపెట్టను అంటూ క్షమాపణలు తెలిపి నీ సుష్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అంతేకాకుండా వారి చిన్నప్పటి ఫొటోలను ఆ హోర్డింగ్ పై ఏర్పాటు చేశాడు. ఇది చూసిన పలువురు ఆ యువకుడికి తన ప్రియురాలి పట్ల ఉన్న ప్రేమకు ముగ్దులవుతున్నారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై స్పందిస్తున్న పలువురు నెటిజన్స్ ఆ యువకుడిది నిజమైన ప్రేమ అని, అలాంటి ప్రియుడిని మిస్ చేసుకోవద్దంటూ, ఆ అమ్మాయి క్షమించాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
In today’s episode of what the fuck goes on in Noida pic.twitter.com/cScEMdkZmE
— 🥭 🐭 (@uDasKapital) June 26, 2023