ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో కంపెనీలు తమ ఉత్పత్తులను అమ్ముకోడానికి నానా తంటాలు పడుతూ ఉంటాయి. అందుకోసం కొన్ని సంస్థలు పక్కదారి సైతం పడుతూ ఉంటాయి. మరికొన్ని కంపెనీలు సెలబ్రిటీలతో ప్రచారం చేయిస్తాయి. అలా కంపెనీలు తమ వస్తువులను వినియోగదారులకు దగ్గర చేస్తాయి. అయితే ఈ క్రమంలో దిగ్గజ ఇ-కామర్స్ సంస్థ అయిన ఫ్లిప్ కార్ట్ ఓ వివాదంలో చిక్కుకుంది. దానికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
Now Flipkart cm out as t new on t list of abusers of Sushant Singh Rajput
Shame on Flipkart
You r now earning money on an innocent deceased soul by tagging him as a mental patientIs tat much worst condition u r in right now..??
Sushant 4m Dreamer 2 Achiever
— Soma Dutta (@SomaDut96461948) July 26, 2022
ఇటీవల కంపెనీలు ప్రతీది వ్యాపార కోణంలోనే చూస్తున్నాయి. తమ వస్తువుల మార్కెటింగ్ విషయంలో కంటెంట్‌ని కాకుండా వివాదాలతో లాభాలను పొందాలని భావిస్తున్నాయి. సోషల్ మీడియా వాడకం పెరిగినప్పటి నుంచి ఇలాంటి వాటినే పబ్లిసిటీ స్టంట్‌గా చేసుకుని దాన్ని వ్యాపారంగా మార్చుకోవాలని చూస్తున్నాయి. గతంలో చెప్పుల పై దేవుళ్ల బొమ్మలు, చెగు వేరా ఫోటోలను ముద్రించిన విషయం తెలిసిందే. తాజాగా దేశంలోనే అతి పెద్ద ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ నెటిజన్ల ఆగ్రహానికి గురైంది.
వివాదానికి సంబంధించి ఫ్లిప్ కార్ట్ ఇ-కామర్స్ సైట్లో ఓ టీ-షర్ట్ పై బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఫొటోతో పాటు ‘డిప్రెషన్ ఈజ్ డ్రోయింగ్’ అనే ట్యాగ్ లైన్ తో అమ్మకానికి పెట్టారు. దీంతో ఈ ఫొటోని చూసిన సుశాంత్ అభిమానులు ఓ రేంజ్ లో ఫ్లిప్ కార్ట్ ని విమర్శిస్తున్నారు. బాయ్ కాట్ ఫ్లిప్ కార్ట్ అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టారు. అలాగే మానవత్వం లేదా మీకు.. డిప్రెషన్ అనే పదాన్ని ఎందుకు వాడారు, అని కొందరు నెటిజన్స్ అంటున్నారు. అలాగే సైట్ నుంచి ఆ టీ-షర్ట్ ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. మరో సంస్థ అయిన అమెజాన్ పైన కూడా విమర్శలు గుప్పిస్తున్నారు.
Country has not yet come out of the shock of Sushant’s tragic death.
We will keep raising our voice for justice..
Flipkart should be ashamed of this heinous act and should apologize that such incident will not be repeated again.#BoycottFlipkart pic.twitter.com/wEVLPYl5EH
— Kashyap (@Kashyap_updates) July 26, 2022
దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ .. తమ వస్తువులు అమ్మడాని కోసం ఇంతకి దిగజారుతారా అంటూ.. కామెంట్స్ చేస్తుంటే, మరొకరు ఫ్లిప్‌కార్ట్‌కి ఎందుకీ పైత్యం.. అంటున్నారు. మరొక యూజర్ “చనిపోయిన వ్యక్తి ఫోటోను టీ షర్ట్‌పై పెట్టడమే కాకుండా, అలాంటి కోట్‌ను యాడ్ చేస్తారా” అంటూ తీవ్రంగా మండిపడ్డాడు. చనిపోయిన హీరోకి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ మరికొంద విమర్శిస్తున్నారు. మరి దీనిపై ఫ్లిప్ కార్ట్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. మరి ఇలాంటి కంపెనీల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
How dare you @Flipkart & @amazon call Sushant depressed? There is absolutely no evidence proving he was depressed.
Stop maligning Sushant’s image
Remove it right now#BoycottFlipkart #boycottAmazonSmear Campaign Against SSR pic.twitter.com/uH0M5wknYI
— Justice seeker-Kritika🔱 (@Kritika4Sushant) July 27, 2022