గుండెపోటు.. గత కొంత కాలం నుంచి ప్రతీ ఒక్కరినీ భయపెడుతున్న సమస్య. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చాలా మంది హార్ట్ ఎటాక్ తో మరణిస్తున్నారు. ఈ వరుస ఘటనలు మరువకముందే తాజాగా ఓ 14 ఏళ్ల బాలుడు గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?
గత కొన్ని రోజుల నుంచి చాలా మంది గుండెపోటుతో మరణిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి వృద్దుల వరకూ అందరూ హార్ట్ ఎటాక్ తో ప్రాణాలు విడుస్తున్నారు. డ్యాన్స్ చేస్తూ, కబడ్డీ ఆడుతూ అక్కడికక్కడే కుప్పకూలుతున్నారు. అయితే తాజాగా కూడా ఓ బాలుడు క్రికెట్ ఆడుతూ కుప్పకూలాడు. వెంటనే స్పందించి ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ హార్ట్ ఎటాక్ తో మరణించాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే? మహారాష్ట్ర పూణేలోని ఓ ప్రాంతంలో వేదాంత్ అనే 14 ఏళ్ల బాలుడు తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటున్నాడు. అయితే తాజాగా తన ఫ్రెండ్స్ తో కలిసి క్రికెట్ ఆడటానికి వెళ్లాడు.
గ్రౌండ్ లోకి వెళ్లాక ఎంతో ఉల్లాసంగా క్రికెట్ ఆడాడు. కానీ, ఉన్నట్టుండి ఆ బాలుడు క్రికెట్ ఆడుతూనే కుప్పకూలాడు. తోటి స్నేహితులు వెంటనే ఆ బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకుని ఆ బాలుడిని ఆస్పత్రికి తరలించడంతో వైద్యులు చికిత్స అందించారు. కానీ, ఫలితం లేకపోవడంతో ఆ బాలుడు గుండెపోటుతో మరణించాడు. కుమారుడి మరణ వార్త తెలుసుకుని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. గుండెపోటుతో బాలుడి మృతిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.