ఆడపిల్లకు ప్రతి తండ్రి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాడు. కొన్ని తరాలుగా ఆడపిల్ల పెళ్లికి కట్నం ఇస్తున్నారు. ఇప్పటికీ కొందరు కట్నం ఇస్తూనే ఉన్నారు. అయితే అలా కట్నం ఇచ్చి పెళ్లి చేస్తే పుట్టింటి ఆస్తిపై ఆడపిల్లకు హక్కు ఉందడు అని చాలా మంది మాట్లాడుతుంటారు. అయితే ఆ విషయంపై తాజాగా హైకోర్టు తీర్పును వెలువరిచింది.
ఆడపిల్లకు పుట్టింటి ఆస్తిలో హక్కు ఉంటుందా? ఈ ప్రశ్న వచ్చిన ప్రతిసారి తోబుట్టువుల నుంచి వచ్చే ఒకే ఒక సమాధానం పెళ్లి సమయంలో కట్నం ఇచ్చాం కదా? కట్నం ఇచ్చి అంగరంగవైభవంగా పెళ్లి చేస్తే.. మళ్లీ ఆస్తిలో వాటా ఎందుకు ఇస్తాం? ఇలాంటి ప్రశ్నలే ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ఇలాంటి ఘటనల్లో గతంలో కూడా కొన్ని తీర్పులు వచ్చాయి. ఆడపిల్లలకు చెప్పకుండా కేవలం కొడుకులకు మాత్రమే ఆస్తిని బదిలీ చేయడంపై ఒక మహిళ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో హైకోర్టు ఆడపిల్లకు ఆస్తిలో హక్కుల విషయంలో మరోసారి స్పష్టతను ఇవ్వడమే కాకుండా.. సంచలన తీర్పును విడుదల చేసింది.
ఆడపిల్లకు పెళ్లి సమయంలో కట్నం ఇచ్చి పెళ్లి చేస్తారు. ఇప్పటికీ కొంతమంది ఆడపిల్లకు కట్నం ఇచ్చే పెళ్లిళ్లు చేస్తున్నారు. అయితే కట్నం ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత ఆడపిల్లకు పుట్టింటి ఆస్తిపై హక్కు ఉంటుందా? ఆస్తిలో వాటా కోసం ఆడపిల్లలు ప్రశ్నించవచ్చా? అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. ఈ విషయంలో చాలామంది గొడవలు కూడా పడుతుంటారు. అయితే ఈ ప్రశ్నలకు బాంబే హైకోర్టు సమాధానం చెప్పింది. ఆడపిల్లకు పెళ్లి సమయంలో కట్నం ఇచ్చి పెళ్లి చేసినా కూడా ఆస్తిలో వాటా ఉంటుందని స్పష్టం చేసింది.
తెరెజిన్హా మార్టిన్స్ డేవిడ్ VS మిగ్యూల్ గార్డా రొసారియో మార్టిన్స్ అండ్ అదర్స్ కేసులో బాంబే హైకోర్టులోని గోవా బెంచ్ తీర్పును వెలువరిచింది. పెళ్లిలో ఇంటి ఆడపిల్లకు కట్నం ఇచ్చారు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని బెంచ్ అభిప్రాయపడింది. అలాగే కట్నం ఇచ్చారనే కారణంతో ఆడపిల్లకు ఆస్తిలో వాటా లేదని అర్థం కాదని స్పష్టం చేసింది. నలుగురు సోదరులు, నలుగురు సోదరీణులు ఉన్న కుటుంబంలో ఆడపిల్ల అనుమతి లేకుండా సోదరులకు ఆస్తి బదిలీ జరిగిపోయింది. ఆ విషయాన్ని పెద్ద కుమార్తె న్యాయస్థానంలో సవాలు చేసింది. దివంగత తండ్రి ఆస్తిలో తనకు కూడా వాటా ఉంటుందని తెలియజేస్తూ ఆమెను కూడా వారసురాలిగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.