ఇటీవల కాలంలో బాంబు బెదిరింపు కేసులు ఎక్కువయ్యాయి. రైళ్లు, విమానాలు, రద్దీ ప్రాంతాలు, సెలబ్రిటీల నివాసాలకు కూడా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఆకతాయిల పనా.. నిజమైనదా అనే సందేహంలో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా ఓ పాఠశాలకు బాంబు బెదిరింపు వచ్చింది.
ఇటీవల కాలంలో బాంబు బెదిరింపు కేసులు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. రైళ్లు, విమానాలు అయిపోయి.. సెలబ్రిటీల నివాసాలకు కూడా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఆకతాయిల పనా.. నిజమైనదా అనే సందేహంలో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. అది నిజమైతే.. ప్రాణాలే కాదూ.. వారి ఉద్యోగాలు కూడా ఊడిపోతాయి. అందుకే పోలీసులు అలర్ట్ అవుతున్నారు. మొన్నటికి మొన్న విమానం ఎక్కనివ్వలేదని ఓ వ్యక్తి ఫోన్ కాల్ చేసి బెదిరించిన సంగతి విదితమే. అలాగే నటీనటులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. స్పందించిన పోలీసుల వెంటనే టీమ్‌తో సోదాలు నిర్వహిస్తున్నారు. అది అబద్ధమా, నిజమా అని తేలుస్తున్నారు. ఈ క్రమంలో వారి సమయం, పని వృథా అవుతుంది.
తాజాగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది. మధుర రోడ్డులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో బాంబులు ఉన్నాయంటూ బుధవారం ఉదయం .. ఆ పాఠశాలకు మెయిల్ వచ్చింది. తక్షణమే పిల్లలను, స్కూల్ సిబ్బందిని అక్కడి నుండి బయటకు పంపించేశారు. అనంతర పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ బాంబు బెదిరింపు మెయిల్‌తో పిల్లలను తీసుకువచ్చేందుకు తల్లిదండ్రులు పరుగున పాఠశాలకు చేరుకున్నారు. దీంతో స్కూల్ వద్ద భయాందోళన, హడావుడి కనిపించింది. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఎస్‌డబ్ల్యూఏటీ టీమ్‌తో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఎలాంటి పేలుడు పదార్థాలను గుర్తించలేదు. ఈ మెయిల్ ఎక్కడి నుండి వచ్చిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. రెండు రోజుల క్రితమే ఇండియన్ పబ్లిక్ స్కూల్‌కు కూడా ఇదే రకమైన బెదిరింపు వచ్చింది.