ఈ మద్య కాలంలో ప్రమాదాలు ఎప్పుడు ఎలా ముంచుకు వస్తున్నాయో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. సాధారణంగా నదిలో ప్రయాణాలు కొన్నిసార్లు ప్రమాదకరంగా ఉంటాయి. పరిమితికి మంచి ప్రయాణిస్తే అదుపుతప్పి బోల్తా పడుతుంటాయి.
మనిషికి మృత్యువు ఏ రూపంలో వచ్చి పడుతుందో ఎవరూ ఊహించలేరు. ఈ మద్య కాలంలో వరుస రోడ్డు ప్రమాదాలు, హార్ట్ ఎటాక్ మరణాలు, ప్రకృతి విపత్తు వల్ల జరుగుతున్న ప్రమాదాల్లో చాలా మంది మరణిస్తున్నారు. సాధారణంగా పడవలో పరిమితికి మించి ప్రయాణిస్తే ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అలాంటి ప్రయాణాలు ప్రాణాలక ప్రమాదం అని తెలిసినా.. కొంతమంది తప్పని సరిపరిస్థితుల్లో వెళ్లి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో గంగా నదిలో పడవ బోల్తాపడి పలువురు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళితే..
ఉత్తర్ ప్రదేశ్ లో బల్లియా లో 40 మందితో గంగానదిలో ఓ పడవ వెళ్తుంది. అకస్మాత్తుగా పడవ బోల్తా పడింది. దీంతో పడవలో ప్రయాణిస్తున్నవారు ఒక్కసారిగా నదిలో పడిపోయారు. దాదాపు 25 మంది వరకు గల్లంతైనట్లు సమాచారం. బబ్లియా జిల్లాలోని మల్దేపూర్ గంగా ఘాట్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే పడవలో ఉన్నవారంతా ఒకే కుటుబానికి చెందిన వారిగా అధికారులు చెబుతున్నారు. అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు వారు పడవలో వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. పడవ ఒక్కసారే నదిలో బోల్తా పడటంతో కేకలు వేశారు. ఆ కేకలు చుట్టు పక్కల వాళ్లు విని వెంటనే సహాయకచర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు కొంతమంది ప్రాణాలు కాపాడగలిగారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
बलिया में बड़ा हादसा, गंगा में नाव पलटने से 30 लोग डूबे, 4 लोगों की मौत. बाकियों को बचाने की कोशिश जारी. #balia #ganga pic.twitter.com/ROSTjA8Qt0
— Amit Shukla (@amitshuklazee) May 22, 2023