తాగి బండి నడపొద్దురా అని పోలీసులు ఎంత చెప్పినా మందు బాబులు వినటం లేదు. ఈ విషయం మనకూ తెలుసు. ఊ.. నువ్వెవరు చెప్పడానికి..! మా డబ్బులు.. మా బాడీ.. మా ఇష్టం.. ఇది మందుబాబుల స్లోగన్. తాగి పట్టుబడినప్పుడల్లా వేలకు వేలు ఫైన్లు రాస్తున్నా దారికి రావటం లేదు. ఈ క్రమంలో ఓ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు పోలీసులు. కొత్త నిబంధనల ప్రకారం డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే.. రక్త దానం చేయాలి. లేదంటే సమీపంలోని ఆసుపత్రిలో కొన్ని గంటల పాటు రోగులకు సేవ చేయాలి.
పంజాబ్‌లో రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతిరోజు 13 మంది మరణిస‍్తున్నారు. 2011 నుంచి 2020 వరకు పదేళ్ల కాలంలో 56,959 ప్రమాదాలు జరిగగా.. 46,550 మంది మరణించారు. ఇందులో మందుబాబుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. అందుకే పంజాబ్ పోలీసులు వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మందు కొట్టి పట్టుబడితే.. రక్త దానం చేయండి. లేదంటే సమీపంలోని ఆసుపత్రిలో కొన్ని గంటల పాటు రోగులకు సేవ చేయాలి అంటూ కొత్త రూల్స్ తీసుకొచ్చారు.
కొత్త నిబంధనలు ఇలా..
అయితే.. కొత్త నిబంధనల అంత కఠినమైనవి కాదంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి శిక్షల వల్ల తాగే వారి సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గదని సెటైర్లు వేస్తున్నారు. అసలు.. మందు తగినవాడి నుండి రక్తాన్ని ఎలా సేకరిస్తారు. అతని రక్తంలో అధికశాతం ఆల్కహాల్ ఉంటుంది కదా.. అని పోలీసులకే సలహాలిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే.. రక్త దానం చేయమనడం కరెక్టేనా?.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: MLA కి బురద స్నానం చేయించిన మహిళలు.. వీడియో
ఇది కూడా చదవండి: ఉప్పొంగుతున్న నదిలోకి హీరోలా దూకాడు.. పాపం చివరకు!