గుజరాత్ కు చెందిన క్షమాబిందు అనే యువతి తనను తానే పెళ్లి చేసుకోబొతున్నట్లు ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఈ అమ్మాయి నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భారత దేశంలో ఇలాంటి ధోరణులు కొత్త కావడంతో క్షమాబిందు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వడొదర గోత్రి ఆలయంలో తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు బిందు ఇప్పటికే పెళ్లి పత్రికలు కూడా అచ్చు వేయించింది. ఈక్రమంలో ఆమెకు పెద్ద షాక్ తగిలింది. ఆమె నిర్ణయం పై కొందరి నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది.
తనను తానే పెళ్లాడి.. ఎంచక్కా సోలో హనీమూన్ ప్లాన్ చేసుకున్న ఈ యువతికి వివాహాన్ని అడ్డుకుని తీరతామని బీజేపీ ప్రకటించింది. వడోదరా మాజీ డిప్యూటీ మేయర్ సునీత శుక్లా ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. క్షమా బిందు తనను తాను పెళ్లి చేసుకుంటానని ప్రకటించుకుంది. సాధారణ పెళ్లి లాగే అంతా పద్ధతి ప్రకారం వివాహం కోసం ఏర్పాట్లు చేసుకుంటోంది. అన్ని ఆర్భాటాలతో (ఒక్క వరుడు, బరాత్) అన్నీ సంప్రదాయబద్దంగా జరుపుకోవాలనుకుంది. అయితే ఇదే సమయంలో చాలామంది వ్యతిరేకిస్తుంటే.. కొందరు ఆమెకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో బిందు నిర్ణయాన్ని బీజేపీ నేత సునీతా శుక్లా ఖండించారు. బిందు వివాహాన్ని అడ్డుకుని తీరతామని ప్రకటించారామె.
ఇదీ చదవండి: షాకింగ్ వీడియో.. కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే కాళ్లు మొక్కిన CM!“ఈ తరహా వివాహాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. ఆమె ఏ గుడిలో వివాహం చేసుకోవడానికి మేం అనుమతించం. ఇలాంటి వివాహాలు హిందూ మతానికి, భారత సంప్రదాయానికి విరుద్ధం. ఇలాంటి వాళ్ల చేష్టలతో హిందువుల జనాభా తగ్గే ప్రమాదం ఉంది. మతానికి విరుద్ధంగా ఏదైనా జరిగితే.. ఏ చట్టమూ ఒప్పుకోదు” అని శుక్లా పేర్కొన్నారు. మరొక వైపు ఆమె పెళ్లికి గోత్రి ఆలయ వర్గాలు ఈ పెళ్లికి నో చెప్పాయి. తమ ఆలయంలో ఇలాంటి పెళ్లికి అంగీకరించబోమని స్పష్టం చేశాయి. ఈ తరహా వివాహాలు సమాజాన్ని పెడదోవ పట్టిస్తాయని గోత్రి ఆలయ పాలకమండలి అభిప్రాయపడింది. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.