ఈ మధ్యకాలంలో సినీ, రాజకీయ రంగాల్లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇలా ప్రముఖల మృతితో వారి కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు విషాదంలో మునిగిపోతున్నారు. తాజాగా కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత ఒకరు మృతి చెందారు.
ఈ మధ్యకాలంలో సినీ, రాజకీయ రంగాల్లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇలా ప్రముఖల మృతితో వారి కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు విషాదంలో మునిగిపోతున్నారు. గుండె పోటు, రోడ్డు ప్రమాదం, అనారోగ్యం వంటి కారణాలతో ప్రముఖులు మృత్యువాత పడుతున్నారు. ఇటీవల కాలంలోని కృష్ణ, తారకరత్న, హిందుజ వంటి ప్రముఖులు మరణించారు. తాజాగా కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుతం బీజేపీ ఎంపీ రతన్ లాల్ కటారియా(72) కన్నుమూశారు. దీంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ రతన్ లాల్ కటారియా(72) కన్నుమూశారు. గతకొంత కాలంగా నియోనియాతో ఆయన బాధ పడుతున్నారు. ఈ క్రమంలోనే చండీగఢ్ లోని పీజీఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. చాలా రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న కటారియా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈయన హర్యానా రాష్ట్రంలోని అంబాలా లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. అలానే 2019 నుంచి 2021 వరకు కేంద్ర మంత్రిగా పని చేశారు. కేంద్ర జల్ శక్తి, సామాజిక న్యాయ, సాధికారిత శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
చాలా కాలం వరకు బీజేపీలో క్రియాశీలకంగా కటారియా పాల్గొన్నారు. ఇప్పుడు ఆయన మృతితో బీజేపీ ఓ మంచి నాయకుడిని కోల్పోయింది. కటారియా మృతికి హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ సంతాపం తెలియజేశారు. అలానే పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఆయన భౌతిక కాయన్నికి నివాళ్లర్పించారు. మరికొందరు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేశారు. గురువారం సాయంత్ర అధికార లాంఛనాలతో రతన్ లాల్ కటారియా అంత్యక్రియలు జరగనున్నాయి. మరి.. కేంద్ర మాజీ మంత్రి మృతికి మీ సంతాపాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.