కర్ణాటకలో హిజాబ్ వస్త్ర ధారణ వివాదం తీవ్ర రూపం దాల్చింది. హిజాబ్, కాషాయ వస్త్రధారణలతో విద్యార్థులు కళాశాలలకు రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొన్ని కళాశాలల విద్యార్థుల మద్య పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. పోటాపోటీగా నినాదాలు చేశారు. కొన్నిచోట్ల రాళ్లు రువ్వుకున్నారు. దీంతో పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు గాయపడ్డారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పలుచోట్ల పోలీసులు లాఠీఛార్జి చేసి, బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మూడు రోజుల పాటు డిగ్రీ, పీయూ కళాశాలలకు సెలవులు ప్రకటించింది.
ఇది చదవండి: వాటే ఐడియా సర్ జీ : లేస్ ప్యాకెట్లతో చీర.. వీడియో వైరల్
ఇదిలా ఉంటే హిజాబ్ వివాదంపై పలువురు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కర్ణాటకలో హిజాబ్ వివాదంపై బుధవారం ప్రియాంక గాంధీ క్లాస్‌రూంల్లో హిజాబ్ ధరించడంపై నిషేధం విధించటంపై విద్యార్ధినులకు మద్దతుగా ప్రియాంక ట్వీట్ చేశారు. బికినీ లేదా, జీన్స్ లేదా హిజాబ్..ఇలా ఏం ధరించాలనేదని మహిళల ఇష్టమని, ఇది వారికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రేణుకాచార్య స్పందిస్తూ.. ప్రియాంకా గాంధీ ట్వీట్ దిగజారుడుతనంగా ఉందని అభివర్ణించారు. అంతేకాదు కాలేజీకి వెళ్లే ఆడపిల్లలు ఎటువంటి బట్టలు ధరించాలి? ఎలా ఉండాలి? అని సలహాలు కూడా ఇచ్చారు ఎమ్మెల్యే.
‘చదివే పిల్లలు శరీరం కనిపించకుండా పూర్తిగా బట్టలు కప్పే విధంగా ఉన్న డ్రెస్సులు ధరించాలని చెప్పుకొచ్చారు. అంతటితో ఆగకుండ.. యువతులు,మహిళలు రెచ్చగొట్టేలా ఉన్న దుస్తుల ధరించటంవల్లలనే అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుతున్నాయని అన్నారు. లైంగిక దాడుల ఘటనలు పెరగటానికి తున్నాయని, మహిళల దుస్తులు పురుషులను రెచ్చగొట్టేలా ఉంటున్నాయని అన్నారు. మహిళలు నిండగు వస్త్రధారణ చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు రావని.. మన దేశంలో ఆడవారికి గౌరవం ఉందని’ చెప్పుకొచ్చారు. హిజాబ్ వివాదంపై కర్నాటక హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. కోర్టు విచారణ నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినట్లు తెలుస్తోంది.
“ಬಿಕಿನಿ” ಎಂದು ಹೇಳಿರುವುದು ಅತ್ಯಂತ ಕೀಳುಮಟ್ಟದ ಶಬ್ದ.
ವಿದ್ಯಾರ್ಥಿನಿಯರು ಸಮವಸ್ತ್ರ / ಮೈತುಂಬ ಬಟ್ಟೆ ಹಾಕಿಕೊಂಡರೆ ಶೋಭೆ.
ಕೇಂದ್ರ ಹಾಗು ರಾಜ್ಯದಲ್ಲಿ ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರವಿಲ್ಲದೆ ಹತಾಶರಾಗಿ ಪ್ರಿಯಾಂಕ ಗಾಂಧಿ ಈ ಹೇಳಿಕೆ ನೀಡಿ ಮುಗ್ದ ಹೆಣು ಮಕ್ಕಳನ್ನು ಪ್ರಚೋದಿಸುತ್ತಿದ್ದಾರೆ. pic.twitter.com/wKLIv7PoxA
— M P Renukacharya (@MPRBJP) February 9, 2022