ఎలక్షన్స్ సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు అనేక ప్రకటనలు, హామిలు ఇస్తుంటాయి. అదే విధంగా ఓటర్లను రాజకీయ పార్టీలు ప్రలోభాలకు గురిచేయడం సర్వసాధారణంగా జరిగే విషయమే. ఎన్నికల సమయం దగ్గర పడ్డేకొద్ది నగదు, మద్యం పంపిణీ చేస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తాయి. అయితే ఇందతా లోలోపల రహస్యంగా జరిగే వ్యవహారం మాత్రమే. ఓటర్లకు నగదు, మద్యం పంచుతున్నప్పటికి ఏ రాజకీయనేత బహిరంగంగా చెప్పరు. అయితే ఓ మాజీ మంత్రి మాత్రం బహిరంగంగానే అలాంటి ప్రకటన చేశారు. ఎదుటి పార్టీ కనుకు రూ.3 వేలు ఇస్తే.. మేం దానికి డబుల్ చేసి రూ.6 వేలు ఇస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా నోరుజారిన మాజీ మంత్రి ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
దక్షిణ భారత దేశంలో కీలక రాష్ట్రమైన కర్ణాటకలో మరికొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీల నేతల ఎన్నికల్లో గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇదే సమయంలో ఓటర్లను ఆకర్శించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నిత్యం వివిధ రకాల సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. అలానే బెళగావిలోని సులేబావిలో బీజేపీ నేతలు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళి హాజరయ్యారు. నియోజకవర్గంలో ప్రజలను ఉద్దేశించి రమేశ్ పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించారు. ఇదే సమయంలో బెళగావి నియోజకవర్గంలోని ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిపై తీవ్రస్థాయిలో విరుచకుపడ్డారు.
ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి హోల్ సేల్ మార్కెట్లో టిఫిన్ బాక్సులు, కుక్కర్లు చవగ్గా కొనుగోలు చేసి.. వాటిని ఓటర్లకు పంచుతున్నారని రమేశ్ అన్నారు. ఇంకా చాలా పంచే అవకాశం ఉందని, వాటి విలువ మహా అయితే రూ. 3 వేలు ఉంటుందని తెలిపాడు. తమ అభ్యర్థి కనుకు ఓటుకు రూ.6 వేలు ఇవ్వకుంటే ఓటేయ్య వద్దని కోరుతున్నట్లు ఆయన తెలిపారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. గతంలో ఓ కుంభకోణం కేసులో ఆరోపణలు రావడంతో ఆయన 2021లో మంత్రి పదవికి రాజీనామా చేశారు. రమేశ్ చేసిన ఈ వ్యాఖ్యలను నీటిపారుదల శాఖ మంత్రి గోవింద్ కర్జోల్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి వాటికి తమ పార్టీలో చోటు లేదన్నారు. రమేశ్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. మాజీ మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ప్రత్యర్థి పార్టీల వారు అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకపడుతున్నారు.
#BreakingNews | #Karnataka: BJP minister #RameshJarkiholi vows to defeat Lakshmi Hebbalkar in Belagavi, says ‘will give ₹6000 to each voter’. @Aksharadm6 with the details
Join the broadcast with @GrihaAtul pic.twitter.com/6zFHSdKCUt
— News18 (@CNNnews18) January 22, 2023