మే 10న జరగనున్న ఎన్నికల కోసం బీజేపీ తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. తాము అధికారంలోకి వస్తే పేదలకు మూడు సిలిండర్లతో పాటు.. ఓ అర లీటర్ నందిని పాలు ఇస్తామని పేర్కొంది.
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ దూసుకుపోతోంది. ఎన్నికలు అతి దగ్గరలో ఉండటంతో ఓటర్లను ఆకర్షించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ 16 హామీలతో కూడిన ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. బెంగుళూరులో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై, సీనియర్ నేత యాడ్యూరప్ప సమక్షంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల అయింది. బీజేపీ అధికారంలోకి వస్తే పేద ప్రజలకు ఏడాదికి మూడు సిలిండర్లు, రోజు అర లీటర్ నందిని పాలను ఉచితంగా అందిస్తామని జేపీ నడ్డా పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అందించడమే బీజేపీ విజన్ అని అన్నారు. పేద ప్రజలకు ఆర్థికంగా, సాంఘికంగా చేయూత నందిస్తామని తెలిపారు.
బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రధానంగా మహిళలపై ఫోకస్ చేసింది. ఉగాది, వినాయక చవితి, దీపావళి పండుగల నెలల్లో పేద ప్రజలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇస్తామని తెలిపింది. ప్రతి నెల రేషన్ లో ఐదు కిలోల సిరిధాన్యాలు అందజేస్తామని పేర్కొంది. కర్ణాటక రాష్ట్రంలో ప్రతి తాలూకాలో కీమోథెరపీ, డయాలసిస్ యూనిట్ ఏర్పాటు.. వృద్ధులకు ఉచితంగా వార్షిక హెల్త్ చెకప్ లు చేస్తామని బీజేపీ తన మేనిఫెస్టో లో ప్రకటించింది. ప్రసుత్తం మూడు సిలిండర్లు, అర లీటర్ పాల హామీ దేశ వ్యాప్తంగా వైరల్‌గా మారింది. ఈ రెండు హామీలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరి, పేద ప్రజలకు ఏడాదికి మూడు సిలిండర్లు, రోజు అర లీటర్ నందిని పాల హామీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.