ఓటు కోసం మహిళలను కాకా పడుతుంటారు నేతలు. వారు లేనిద సృష్టి లేదంటూ పొగడ్తలతో ముంచెత్తుతారు. కానీ వాస్తవంలోకి వచ్చేసరికి తమ సమస్యలు ఇవనీ చెబితే పట్టించుకోరు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు దిక్కు ఉండరు. తిరిగి వాళ్లు ఎలా బతకాలో, ఏ డ్రస్ వేసుకోవాలో చెబుతుంటారు మన నేతలు. తాజాగా అమ్మాయిల డ్రస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఓ నేత.
ఎన్నికలు వచ్చాయంటే చాలు ఆడవాళ్లను దృష్టిలో పెట్టుకుని పధకాలు రచిస్తారు రాజకీయ నేతలు. తాము అధికారంలోకి వస్తే అది చేస్తాం, అది చేస్తాం అని ఊదరగొడతారు. వాళ్లంతటోళ్లు లేరని పొగుడుతారు. ఆడవాళ్లు లేకపోతే ప్రపంచమే లేదని చెబుతారు. కానీ వాస్తవానికి వచ్చే సరికి వారు కోరుతున్న మహిళా బిల్లును ఆమోదించరు. దాని సంగతి పక్కన పెడితే.. కనీసం ఆ బిల్లుపై చర్చించేందుకు కూడా ఇష్టపడరు పితృస్వామ్య వ్యవస్థలో బతుకుతున్న మన నాయకులు. మహిళల పట్ల ఉదార స్వభావంతో ఉన్నట్లు కనిపించినప్పటికీ.. వాళ్లు ఎలా బతకాలి, ఏం బట్టలు వేసుకోవాలి, ఏం తినాలో నేతలే నిర్ణయిస్తున్నారు. తాజాగా మహిళల వస్త్రధారణపై అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు ఓ బీజెపీ నేత.
ఈ రోజుల్లో మహిళలంతా శూర్ఫణఖల్లా తయారవుతున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ కైలాశ్ విజయ్‌వర్గియ. హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జైన్ సంఘం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. స్త్రీలు అధ్వానంగా దుస్తులు ధరించడం వల్లే వారిలో దేవతా రూపాన్ని చూడలేకపోతున్నామన్నారు. వారంతా శూర్పణఖల్లా కనిపిస్తున్నారన్నారు. మహిళలు, పురుషులు కలిసి మత్తులో డ్యాన్స్ చేయడాన్నీ తప్పుబట్టారు. రాత్రిపూట తాను కారులో వెళుతుంటే కొంతమంది యువతులు డ్రగ్స్ మత్తులో ఊగిపోతూ కనిపిస్తుంటారని చెప్పారు. వారికి మత్తు దిగేలా చెంప చెల్లుమనిపించాలని తనకు పలుమార్లు అనిపించిందని అన్నారు.
‘నన్ను నమ్మండి. హనుమంతుడిపైన ప్రమాణం చేసి చెబుతున్నాను. అమ్మాయిల డ్రెసింగ్‌లో చాలా మార్పులు వచ్చాయి. అధ్వానమైన దుస్తుల కారణంగా వారిలో ఆ దైవత్వాన్ని చూడలేకపోతున్నాం’ అని వ్యాఖ్యానించారు. దేవుడు ఆడవాళ్లకు మంచి శరీరాకృతిని ఇచ్చాడని, మంచి బట్టలు ధరించాలని సూచించారు. యువత గంజాయికి అలవాటు పడడాన్ని వ్యతిరేకించారు కైలాశ్. ఈ క్రమంలోనే అమ్మాయిల డ్రెసింగ్‌పై కామెంట్స్ చేశారు. దీనిపై మహిళా సంఘాలు మండి పడుతున్నాయి. వాళ్లకు నచ్చిన దుస్తులు వేసుకుంటారంటూ తేల్చి చెబుతున్నాయి. ఇప్పుడే కాదు. గతంలోనూ కైలాశ్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతేడాది ఆగస్టులో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై విమర్శలు చేశారు. విదేశాల్లో మహిళలు బాయ్‌ఫ్రెండ్‌లను మార్చినట్టుగా..ఆర్‌జేడీ తన మిత్ర పక్షాలను మార్చేస్తోందని అన్నారు.
BREAKING | लड़कियों को लेकर BJP नेता कैलाश विजयवर्गीय का विवादित बयान
– ‘लड़कियां इतने गंदे कपड़े पहनकर निकलती हैं, पूरी शूर्पणखा लगती हैं’ :कैलाश विजयवर्गीय@AdarshJha001 | @manishkumars @brajeshabpnews https://t.co/smwhXUROiK#BJP #KailashVijayvargiya #Indore #Breaking pic.twitter.com/vII7tVwgTK
— ABP News (@ABPNews) April 8, 2023