లఖింపూర్ ఖేరీ దుర్ఘటన దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలుసు. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతుల మీదకు మంత్రి ఆశిశ్ మిశ్రా కాన్వాయ్‌లోని ఓ కారు దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు దుర్మరణం చెందారు. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అయ్యింది. తాజాగా ఒడిశాలో ఇదే తరహా సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: 25 ఏళ్లుగా పాక్ జైల్లో భారత్ జవాన్! కొడుకు కోసం 81 ఏళ్ల తల్లి అలుపెరగని పోరాటం!
ఒడిశా ఖుర్దాలో ఎమ్యెల్యే ప్రశాంత్ జగ్‌దేవ్‌కారు ప్రజలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. 25 మందికి పైగా గాయాలపాలైనట్లు తెలిపారు. ఖుర్దాలో పంచాయతీ సమితి ఛైర్‌పర్సన్ ఎన్నికలు జరుగుతున్నాయి. బాన్‌పుర్ బ్లాక్ కార్యాలయం ఎదుట.. ప్రజలు, బీజేడీ కార్యకర్తలు గుమిగూడి ఉండగా.. బీజేడీ బహిష్కృత ఎమ్మెల్యే ప్రశాంత్ జగ్‌దేవ్ కారు వారికిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 15 మంది బీజేడీ కార్యకర్తలుండగా.. 10 మంది పోలీసులున్నట్లు సమాచారం. దీంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్రిక్తతలు చెలరేగాయి. ఆగ్రహించిన ప్రజలు ఎమ్మెల్యే కారుపై దాడి చేశారు.. వాహనాన్ని ధ్వంసం చేశారు. ఎమ్మెల్యేను బటయకు లాగి దాడికి పాల్పడ్డారు. ఈ సమయంలో సదరు ఎమ్మెల్యే మద్యం సేవించి ఉన్నట్టుగా చెబుతున్నారు స్థానికులు.
ఇది కూడా చదవండి: రూ.11 వేల పెట్టుబడితో.. కోటి రూపాయలు సంపాదించింది!
విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రజల దాడి నుంచి ఎమ్మెల్యేను కాపాడి.. ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని ఖుర్దా ఎస్పీ అలేఖ్ చంద్ర పాహి మీడియాకు తెలిపారు.. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఎన్నికల ర్యాలీలో బీజేపీ మద్దతు ఉన్న పంచాయతీ సమితి సభ్యులు బ్లాక్ కార్యాలయంలోకి ప్రవేశిస్తుండగా, అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే వాహనం వారిపైకి దూసుకెళ్లినట్టు చెబుతున్నారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.