ఆమె ఒకప్పుడు పాఠశాలకు ప్రిన్సిపల్ గా పనిచేసింది. తన ఆధ్వర్యంలో ఎందరో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించింది. అలానే సమాజానికి ఎందరో విద్యార్ధులను అందించిన ఆమె.. నేడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మారింది. ఆమె కోసం పోలీసులు , వివిధ దర్యాప్తు సంస్థలు గాలిస్తున్నాయి. మరి... ఆమె కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఆమె ఒకప్పుడు పాఠశాలకు ప్రిన్సిపల్ గా పనిచేసింది. తన ఆధ్వర్యంలో ఎందరో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించింది. అలానే సమాజానికి ఎందరో విద్యార్ధులను అందించిన ఆమె.. నేడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మారింది. ఆమె కోసం పోలీసులతో పాటు మూడు దర్యాప్తు సంస్థకు కూడ గాలిస్తున్నాయి. అంతేకాక ఆమెను పట్టుకుంటే రూ.5 లక్షల బహుమతి కూడా ఇస్తామని ప్రకటించారు. ఇంతకి ఆమె ఎవరు.. ఆ కథ ఏమిటి?. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పట్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేసిన దీప్తి బహల్ ఇప్పుడు ఆ రాష్ట్రంలో మోస్ట్ వాంటెడ్ లేడీ డాన్ గా మారింది. ఈమె బైక్ బాట్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు సంజయ్ భాటి భార్య. అంతేకాక ఈ కుంభకోణం వెనుక కథ నడిపింది అంతా ఈమె. ఇప్పుడు దీప్తి బహల్ కేసును విచారిస్తున్న ‘మీరట్ ఆర్థిక నేరాల విభాగం’ అనే ఆసక్తిర విషయాలు వెల్లడించింది. బైక్ బాట్ స్కామ్ విలువ రూ.4,500 కోట్లు ఉంటుందని, దీప్తిపై 250కి పైగా కేసులు నమోదైనట్లు అంచనా వేసింది.
ఆమె 2019 నుంచి నుంచి పరారీలో ఉంది. సంజయ్ భాటితో వివాహానికి ముందు ఆమె బాగ్‌పట్‌లో టీచర్‌గా పనిచేసినట్లు దర్యాప్తులో తేలింది. అయితే ఆమె ఆ కాలేజీలో విధులు నిర్వహించినట్లు ఆధారంగా ఒక్క రికార్డు కూడా దొరకలేదు. అయితే చౌధరీ చరణ్ సింగ్ యూనివర్సిటీ అనుబంధ కాలేజి అయిన బాగ్‌పట్‌లోని బరౌత్ విద్యాసంస్థ తన వెబ్‌సైట్‌లో దీప్తిని తమ ప్రిన్సిపాల్‌గా పేర్కొంది. దీప్తికి ఎమ్‌ఏ, పిహెచ్‌డీ విద్యార్హత కూడా ఉన్నట్లుగా అందులో పేర్కొంది.
బీఎస్పీ నాయకుడు, సంజయ్ భాటి 2010 ఆగస్టులో ‘గర్విట్ ఇన్నోవేటివ్ ప్రమోటర్స్ లిమిటెడ్’ పేరుతో ఓ కంపెనీని స్థాపించారు. బైక్ బాట్ అనే మల్టీలెవల్ మార్కెటింగ్ పథకం కింద ఒక సంవత్సరంలో రెట్టింపు లాభాలు సంపాదించవచ్చంటూ ఇన్వెస్టర్లను ఆకర్షించారు. ట్యాక్సీ బైక్ కోసం రూ.62,000 పెట్టుబడి పెట్టి 12 నెలల పాటు నెలకు రూ.9,765 వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఒకటి కంటే ఎక్కువ బైక్‌లలో పెట్టుబడి పెడితే అదనపు బోనస్ ప్రోత్సాహకం కూడా లభిస్తుందని పెట్టుబడిదారులతో నమ్మించారు.
అలా 2016 నుంచి 2019 మధ్య కాలంలో యూపీతో సహా అనేక రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు కంపెనీలో పెట్టుబడి పెట్టారు. అలా సేకరించిన పెట్టుబడులతో వాళ్లు పరారయ్యారు. ఈ కుంభ కోణంపై మొత్తం 118 కేసులు నమోదయ్యాయి. ఇందులోని ఆర్థిక నేరాల విభాగం మీరట్ శాఖ దర్యాప్తు చేసింది. ఈ క్రమంలోనే దీప్తిని పట్టుకుంటే రూ.5 లక్షల రివార్డు అందిస్తామని సదరు దర్యాప్తు సంస్థ పేర్కొంది. మరి.. ఈ కుంభకోణం విషయంలో వెలుగులోకి వచ్చిన అంశాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.