మీకు కథలంటే ఇష్టమా..? అటువంటి కథలాంటి వార్తే ఇది. అనగనగా ఒక గ్రామం.. ఆ గ్రామంలో 'రూప్‌చంద్'. అతను సాధాసీదా వ్యక్తి. పనికి వెళ్లకుంటే పస్తులు ఉండాల్సిన పరిస్థితి. ఉండటానికి సొంతిళ్లు కూడా లేదు. కానీ, అతగాడు 40 మంది మహిళలకు భర్త, డజన్ల కొద్దీ పిల్లలకు తండ్రి. ఏం అర్థమవ్వడం లేదు కదూ.. సినిమాని మించిన కథ ఇది.
మీ భర్త పేరు ఏంటమ్మా.. ‘రూప్‌చంద్’, మీ అయన పేరు ఏంటమ్మా.. ‘రూప్‌చంద్’. ఇలా ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా నలభై మంది మహిళలు అతడే తమ భర్త అంటున్నారు. పోనీ ఇంతలా కలవరిస్తున్నారు కదా! అతడేమైనా శ్రీమంతుడా? అంటే అదీ కాదు. అతనో సామాన్యుడు. ఏ రోజు పనికెళ్తే ఆరోజే పూట గడిచే పరిస్థితి. అలాంటిది అతడికి ఏకంగా 40 మంది భార్యలు, డజన్ల కొద్దీ పిల్లలున్నారు. ఇదేదో తేడాగా ఉందనిపిస్తుందా..? ఓ సాధారణమైన వ్యక్తికి ఇంత భార్యలు, ఇంతమంది పిల్లలు ఎలా వచ్చారో తెలియాలంటే ఈ కథ చదవాల్సిందే.
బిహార్ రాష్ట్రంలో ప్రస్తుతం రెండో విడత కులగణన జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు ప్రతి ఇంటికి వెళ్తూ వివరాలు నమోదు చేస్తున్నారు. ఇలానే అర్వల్ జిల్లాలోని ఓ రెడ్‌లైట్ ఏరియాలో నివాసం ఉంటున్న వారి వివరాలు సేకరించేందుకు అక్కడకి వెళ్లారు. ఆపై ఇంటింటా తిరుగుతూ కులం, విద్య, ఆర్థిక స్థితి, కుటుంబ స్థితిగతులు వంటి విషయాలు తెలుసుకుంటున్నారు. ఇలా వివరాలు సేకరిస్తుండగా దాదాపు 40 మంది మహిళలు ఒకే పేరును తమ భర్తగా ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేసుకున్నారు. అంతేకాదు చాలా మంది పిల్లలు కూడా తమ తండ్రి పేరు రూప్‌చంద్ అని తెలిపారు. అందులో ఒక అధికారికి అనుమానం వచ్చ్చి ఆరాతీయగా అసలు విషయం బయటపడింది.
అనుమానమొచ్చిన ప్రభుత్వ అధికారులు.. ఇలా ఎందుకు చెబుతున్నారని వారిని ఆరా తీయగా ఆశ్చర్యపోవడం వారి వంతైంది. ఆ రెడ్‌లైట్ ఏరియాలో రూప్‌చంద్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతనొక డ్యాన్సర్. ఊర్ల వెంట తిరుగుతూ పాటలు పాడుతూ.. డాన్స్ చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. అతడికి సొంతిల్లు కూడా లేదు. కానీ అతడంటే అక్కడి ప్రజలకు చాలా అభిమానం. తమ సొంత కుటుంబ సభ్యుడిలానే అతనిని పరిగణిస్తారు. ఆ అభిమానంతోనే మహిళలందరూ అతని పేరును తమ భర్తగా చెప్పిన్నట్లు తేలింది. ఇక ఆ ప్రాంతంలో ఉండేవారికి కులం అంటూ ఏదీ లేదని అధికారులు చెబుతున్నారు. కుటుంబసభ్యుల పేర్లు, పిల్లలు పేర్లు, చదువు గురించి చెప్తున్నారు తప్ప.. కులం గురుంచి అడిగితే తెలియదని చెప్తున్నారని అధికారులు తెలిపారు. వీరి అభిమానం చల్లగుండా.. ఎంత అభిమానం ఉంటే మాత్రం భర్త అనేస్తారా..? వీరిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Bihar: Who is ‘#Roopchand‘ husband of 40 women? The story reflects the apathy of women living in red-light area#Roopchand #castecensus
Read- https://t.co/vw6jxPNEAa— Raju Kumar (@rajudelhi123) April 26, 2023