ఓ మామ తన అల్లుడితో దారుణంగా వ్యవహరించాడు. అత్తింటికి వచ్చి భార్యను తీసుకుపోదామని భావించిన ఆ అల్లుడిని దారుణంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా అల్లుడు స్ప్రహ కోల్పోయిన తర్వాత అతడి ప్రైవేట్ పార్టులో స్టీల్ గ్లాసు జొప్పించాడు. ఈ సంఘటన బిహార్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. బిహార్, ముజఫర్‌పుర్ జిల్లాలోని సాహెబ్‌గంజ్‌కు చెందిన ఓ యువకుడికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో కొన్నేళ్ల క్రితం పెళ్లయింది. కొద్దిరోజుల క్రితం యువకుడి భార్య పుట్టింటికి వెళ్లింది. భార్య పుట్టింటికి వెళ్లి రోజులు గడుస్తుండటంతో ఆమెను వెనక్కు తీసుకువచ్చేందుకు ఆ యువకుడు అత్తింటికి వెళ్లాడు.
అక్కడ యువకుడికి అతడి మామకు మధ్య గొడవ జరిగింది. దీంతో మామ అల్లుడిని తీవ్రంగా కొట్టాడు. ఆ దెబ్బలకు యువకుడు స్ప్రహ తప్పి పడిపోయాడు. స్ప్రహలో లేని అల్లుడిపై ఆ మామ దారుణానికి ఒడిగట్టాడు. అల్లుడి ప్రైవేట్ పార్టులోకి స్టీల్ గ్లాసు జొప్పించాడు. స్ప్రహ వచ్చిన తర్వాత అతడు ఇంటికి వెళ్లిపోయాడు. తన ప్రైవేట్ పార్టులో గ్లాసు ఉన్నదన్న సంగతి అతడికి తెలియలేదు. శరీరం లోపల గ్లాసు ఉండటం కారణంగా అతడి కడుపులో నొప్పి రావటం మొదలైంది. నొప్పి భరించలేకపోయిన యువకుడు స్థానిక డాక్టర్ దగ్గరకు వెళ్లాడు.
ఆ వైద్యుడు కడుపు నొప్పికి కొన్ని మందులు రాసిచ్చాడు. అవి వాడినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఆ వైద్యుడే ఓ సలహా ఇచ్చాడు. పెద్దాసుపత్రికి వెళ్లమన్నాడు. ఆ యువకుడు పెద్దాసుపత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యులు అతడికి ఎక్స్‌రే తీశారు. ఎక్స్‌రేలో అతడి ప్రైవేట్ పార్టులో స్టీల్ గ్లాసు ఉన్నట్లు తేలింది. వైద్యులు వెంటనే అతడికి ఆపరేషన్ చేసి గ్లాసును బయటకు తీశారు. ఇక, ఈ దారుణంపై యువకుడి కుటుంబసభ్యులు పోలీసులకు అయితే ఫిర్యాదు చేయలేదు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.