ఈ విశ్వంలో సైన్స్‌కి అందని వింతలు, విషేశాలు ఎన్నో ఉన్నాయి. వాటి గురించి వివరించడానికి ఎలాంటి ఆధారాలు సరిపోవు. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పుడే దైవం పేరు తెర మీదకు వస్తుంది. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి తాజాగా వెలుగు చేసింది. సాధారణంగా మహిళ.. బిడ్డకు జన్మనివ్వాలంటే.. రజస్వల అయిన తర్వాతే సాధ్యం అవుతుంది. అప్పుడే స్త్రీ శరీరంలో రుతుచక్రం ప్రారంభం అయ్యి.. అండం విడుదల అవుతుంది. సాధారణంగా 10-12 ఏళ్ల తర్వాత ఆడపిల్లల్లో రుతుచక్రం ప్రారంభం అవుతుంది. ఆ తర్వాతే వారు గర్భం దాల్చగలుగుతారు. కానీ ఇప్పుడు మీరు చదవబోయేది ఇందుకు పూర్తి భిన్నమైన వార్త. ఇక్కడ కేవలం 40 రోజుల వయసున్న ఓ శిశువు కడుపులో పిండం ఉంది. అదేలా సాధ్యమయ్యిందో తెలియాలంటే ఇది చదవండి..
40 రోజుల పసికందు కడుపులో పిండం పెరుగుతున్న విషయం తెలిసి వైద్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. 40 రోజుల నవజాత శిశువు కడుపు భాగంలో ఉబ్బి ఉండటాన్ని గమనించిన తల్లిదండ్రులు హాస్పిటల్ కు తీసుకెళ్లగా ఈ విషయం బయటపడింది. ఈ అరుదైన ఘటన బిహార్‌లో వెలుగులోకి వచ్చింది. మోతిహారీ జిల్లాలోని రహ్మానియా మెడికల్ సెంటర్‌కు ఓ దంపతులు తమ 40 రోజుల శిశువును తీసుకొచ్చారు. శిశువును పరీక్షించిన వైద్యులు.. పొట్ట వద్ద ఉబ్బెత్తుగా ఉండటంతో సరిగా మూత్ర విసర్జన చేయలేకపోతోందని గ్రహించారు. దీనికి కారణాన్ని తెలుసుకునేందుకు సిటీ స్కాన్ చేయడంతో విషయం బయటపడింది.
ఇది కూడా చదవండి: Bihar: చదువు కోసం చిన్నారి కష్టం.. ఒకే కాలుతో 1 కిలో మీటర్ ప్రయాణం!స్కానింగ్ రిపోర్ట్ చూసిన అక్కడ వైద్యుడు తబ్రీజ్ అజీజ్ ఆశ్చర్యపోయారు. శిశువు పొట్టలో ఓ పిండం ఉందని, అది పెరుగుతూ వస్తోందని గుర్తించారు. శిశు కడుపులో మరో పిండం పెరగడాన్ని వైద్య పరిభాషలో ‘ఫీటస్ ఇన్ ఫీటూ’గా 9పిండంలో పిండం) పిలుస్తారని వైద్యులు తెలిపారు. ఐదు లక్షల మందిలో ఒక్కరికే ఇలాంటి అరుదైన సమస్య వస్తుందని పేర్కొన్నారు. సమస్య గురించి తల్లిదండ్రులకు వివరించి, శస్త్రచికిత్స ద్వారా విజయవంతంగా తొలిగించినట్టు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Bihar: చిలుక తప్పిపోయింది.. పట్టిస్తే ఊహించనంత నజరానా!
డాక్టర్ అజీజ్ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘‘40 రోజుల పసికందు కడుపులో పిండం అభివృద్ధి చెందుతున్న అరుదైన ఘటన వెలుగులోకి వచ్చింది.. పిండంలో పిండ ఉండటాన్ని ఫీటస్ ఇన్ ఫీటూగా పిలుస్తారు. అంటే కవల పిండాల్లో ఒకటి మరొక పిండంలోకి చేరుతుంది. దీంతో ఒక పిండమే బిడ్డగా ఎదుగుతుంది.. రెండో పిండం ఆ బిడ్డ శరీరంలో ఉండిపోతుంది.. ప్రస్తుతం శిశువుకు శస్త్రచికిత్స జరిగింది.. పరిస్థితి నిలకడగా ఉంది’’ అని చెప్పారు. సర్జరీ అనంతరం చిన్నారి కోలుకుందని, పూర్తి ఆరోగ్యంతో ఉండటంతో డిశ్చార్జి చేసినట్లు తెలిపారు. మరి ఈ వింత సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Bihar: భార్యను హత్య చేసినందుకు జైల్లో భర్త.. ప్రియుడితో పారిపోయిన భార్య!