ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో ప్రభుత్వం తీవ్ర అలసత్వం చూపిస్తుందని పాట్నాలో రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్న అభ్యర్థులపై పోలీసులు తమ ఝులం చూపించారు. అంతేకాదు అక్కడ ఉన్న డిప్యూటీ కలెక్టర్ పోలీస్ చేతిలో నుంచి లాఠీ తీసుకొని యువకుడిని రక్తం వచ్చేట్లుగా చితకబాదాడు. బిహార్లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దోషులపై తగని చర్యలు తీసుకుంటామని ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ తెలిపారు. వివరాల్లోకి వెళితే..
బిహార్ రాజధాని పట్నాలో ఉపాధ్యాయ నియామక ప్రక్రియ వేగవంతం చేయాలని, ఇటీవల అర్హత సాధించిన అభ్యర్థులు నిరసనలు వ్యక్తం చేశారు. ఆదే సమయంలో అక్కడ ఓ యువకుడిపై డిప్యూటీ కలెక్టర్ కె.కె.సింగ్ పోలీసుల నుంచి లాఠీ తీసుకుని ఆ యువకుడిని దారుణంగా కొట్టాడు. ఈ దారుణాన్ని అక్కడ మీడియా చిత్రీకరిస్తోందన్న విషయాన్ని సదరు డిప్యూటీ కలెక్టర్ పట్టించుకోలేదు.
ఇక ఆ యువకుడిని కొడుతున్న సమయంలో లాఠీ జాతీయ జెండాకు అడ్డు పెట్టుకున్నా పట్టించుకోలేదు. డిప్యూటీ కలెక్టర్ కొట్టిన దెబ్బలకు యువకుడి చెవి నుంచి రక్తం వచ్చినప్పటికీ ఆపకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ తీవ్ర గ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
माननीय उपमुख्यमंत्री जी ने पटना जिलाधिकारी से फोन पर वार्ता की। DM ने पटना Central SP और DDC के नेतृत्व में एक जाँच कमेटी का गठन किया है कि ADM ने अभ्यर्थियों पर स्वयं लाठीचार्ज क्यों किया, ऐसी क्या नौबत थी?दोषी पाए जाने पर संबंधित अधिकारी पर कारवाई होगी।
pic.twitter.com/XKLKhxBFQ4— Office of Tejashwi Yadav (@TejashwiOffice) August 22, 2022