నిరుపేద కుటుంబం. అతనొక డీజే వర్కర్. ఉండడానికి ఇల్లు ఉంది అని చెప్పుకున్నా.. కనీస సౌకర్యాలంటూ ఏవీ ఉండవు. ఇంటిల్లిపాది రోజు వారి కూలీకి వెళ్తే గానీ కుటుంబం గడవదు. పైగా ఇద్దరు చిన్నపిల్లలు. అలాంటిది రాత్రికి రాత్రే ఆ ఇంటిల్లిపాది కోటీశ్వరులు అయ్యారు. ధనలక్ష్మీ తలుపు తట్టి మరీ కోట్లు కుమ్మరించింది. ఆస్ట్రేలియా వేదికగా జరిగే ‘బిగ్ బాష్ లీగ్’ అతడిపై కాసుల వర్షం కురిసింది. ఫాంటసీ యాప్ ‘డ్రీమ్ 11’లో క్రికెట్ బెట్టింగ్ కాచి కోటి రూపాయలు గెల్చుకున్నాడు. ఆ వివరాలు..
ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్ వేసే వారికి డ్రీమ్ 11 ఫాంటసీ యాప్ సుపరిచితమే. క్రికెట్ సహా ఫుట్‌బాల్, టెన్నిస్, కబడ్డీ, బాస్కెట్‌బాల్, హ్యాండ్ బాల్ వంటి క్రీడలపై బెట్టింగ్ వేసేందుకు ఈ వేదిక వీలు కల్పిస్తోంది. ఇందులో డబ్బులు గెలుచుకోవాలని ఎంతో మంది ప్రయత్నిస్తుంటారు. తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ తొలిస్థానంలో నిలిచి జాక్‌పాట్ కొట్టాలని భావిస్తుంటారు. కానీ, ఆ అదృష్టం కొద్ది మందినే తలుపు తడుతూ ఉంటుంది. అలాంటి వారిలో రాజు రామ్ ఒకరు. బీహార్, నవాడ పరిధిలోని పిప్రా గ్రామానికి చెందిన రాజు రామ్ గత ఏడాదిన్నరగా డ్రీమ్ 11 యాప్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. తాజాగా గురువారం(డిసెంబర్ 29) న జరిగిన బ్రిస్బేన్ హీట్ వర్సెస్ సిడ్నీ థండర్ మ్యాచులో రూ.49 పెట్టి ఫాంటసీ గేమ్ ఆడాడు. ఈ గేమ్ లో అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో రూ.కోటి గెలుచుకున్నాడు.
గెలుచుకున్న మొత్తంలో పన్ను తీసివేయగా.. రూ.70 లక్షలు అతడి ఖాతాలో జమయ్యాయి. అయితే.. రాజురామ్ కు వాలెట్ లో డబ్బులు ఎందుకు యాడ్ అయ్యాయన్న విషయం అర్థం కాలేదు. తరువాత ఆ నోటా.. ఈ నోటా పాకి.. అతడు బెట్టింగ్ కాచిన గేమ్ రిజల్ట్స్ ఓపెన్ చెసి చూస్తే.. మొదటి స్థానంలో అతని పేరే ఉంది. ఈ విషయం తెలుసుకున్న రాజురామ్, అతని కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగిపోయారు. డ్రీమ్11లో గెలుచుకున్న సొమ్మును వ్యాపారం కోసం ఉపయోగిస్తానని రాజురామ్ తెలిపాడు. తాను ఇప్పటి వరకు కొంతమొత్తం గెలుచుకున్నానని.. ఇప్పుడు రూ.75 లక్షలు సంపాదించడం సంతోషంగా ఉందని చెప్పాడు. అయితే.. దేశంలో పలు రాష్ట్రాలలో గేమింగ్ యాపులపై నిషేధం ఉంది. అయినా ఏదో ఒక రకంగా బెట్టింగ్ కాస్తూనే ఉన్నారు.
#Nawada: मोबाइल पर गेम खेलते हुए रातों रात करोड़पति बना यह शख्स। Dream 11 पर जीते एक करोड़ रुपए। देखिए पूरी खबर।#MobileGaming #Dream11 pic.twitter.com/iM1K6sQoVl
— Bihar Tak (@BiharTakChannel) December 31, 2022