మానవ సంబంధాలన్ని ఆర్థిక సంబంధాలే అని ఓ కవి అన్నాడు. మరీ ముఖ్యంగా నేటి రోజుల్లో… ప్రతి దాన్ని ఆర్థిక కోణంలోనే చూస్తున్నాడు మనిషి. నాకేంటి లాభం అని ఆలోచిస్తున్నాడు. ఆఖరికి కళ్లెదురుగా సాటి మనిషి మృతి చెందినా.. మనసు కరగడం లేదు. ఆఖరికి మృతదేహాన్ని అప్పగించే దగ్గర కూడా లంచం డిమాండ్ చేసి అమానవీయంగా వ్యవహరిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఏపీ రిమ్స్ ఆస్పత్రిలో అంబులెన్స్ డ్రైవర్లు ఎంత అమానవీయంగా ప్రవర్తించారో చూశాం. చివరకు చేసేదేం లేక.. ఆ తండ్రి బైక్ మీదనే కుమారుడి మృతదేహాన్ని తరలించాడు. తాజాగా బిహార్‌లో ఇలాంటి హృదయవిదారక సన్నివేశం చోటు చేసుకుంది. కన్నకొడుకు మరణించి పుట్టెడు దుఖంలో ఉన్న తల్లిదండ్రులను వదల్లేదు లంచాసురులు.. పైగా బిడ్డ శవాన్ని ఇవ్వాలంటే.. అడిగినంత లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ తల్లిదండ్రులు తమ వద్ద డబ్బులు లేవని చెప్పినా.. వారి గోడు పట్టించుకోలేదు. చివరకు చేసేదేంలేక ఆ తల్లిదండ్రులు.. అధికారులకు లంచం ఇవ్వడం కోసం బిచ్చమెత్తారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు..
బిహార్‌లోని సమస్తిపూర్‌లో ఈ హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. కుమారుడు మృతదేహాన్ని ఇచ్చేందుకు ఆసుపత్రి సిబ్బంది 50 వేల రూపాయల లంచం డిమాండ్ చేయడంతో.. ఆ సొమ్ము కోసం ఆ తల్లిదండ్రులు ఊరంతా తిరుగుతూ భిక్షమెత్తుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘నా కుమారుడు కొన్ని రోజుల క్రితం కన్పించకుండా పోయాడు. అతడు చనిపోయాడని, సమస్తిపూర్లోని సర్దార్ ఆసుపత్రిలో మృతదేహం ఉంది.. వచ్చి తీసుకెళ్లాలని నాకు ఇటీవల ఫోన్ కాల్ వచ్చింది. ఆసుపత్రికి వెళ్తే.. రూ.50వేలు ఇస్తేనే శవాన్ని అప్పగిస్తామని చెప్పారు. మేం చాలా పేద వాళ్లం. అంతమొత్తం ఎక్కడినుంచి తెచ్చేది’’ అంటూ మృతుడి తండ్రి మహేశ్ ఠాకూర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Video: క్లాస్ లో నిద్రపోతున్న టీచరమ్మ.. విసినకర్రతో విసురుతూ నిల్చున్న విద్యార్థిని!
ఇక ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో ఆసుపత్రి సిబ్బంది నిర్వాకంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఆసుపత్రిలో పనిచేస్తోన్న చాలా మంది కాంట్రాక్ట్ ఉద్యోగులే. గత కొన్ని రోజులుగా వారికి జీతాలు సరిగా లేకపోవడంతో ఇలా రోగుల బంధువుల నుంచి డబ్బులు డిమాండ్ చేసి తీసుకుంటున్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి..
ఇది కూడా చదవండి: Bihar: నీతో కాపురం చేయనంటూ పోలీస్ భర్తకు తెగేసి చెప్పిన భార్య.. మనోడు ఏం చేశాడో తెలుసా!
ఈ ఘటనపై ఆసుపత్రి యాజమాన్యం స్పందించింది. ఇది అమానవీయ ఘటన అని, బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు జిల్లా అదనపు మెజిస్ట్రేట్ వినయ్ కుమార్ రాయ్ తెలిపారు. ఈ దారుణ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
बेटे की लाश चाहिए तो 50 हजार रुपये लाओ, वरना जाओ। गरीब पिता को भीख मांगनी पड़ी। फिर भी पैसा नहीं जुटा पाए। लाश छोड़नी पड़ी।
बिहार के समस्तीपुर में मानवता को शर्मसार करने वाली घटना हुई है।@NitishKumar @mangalpandeybjp
#Bihar #बिहार #BiharNews #samastipur pic.twitter.com/PlPq486r1z— Braj Mohan Mishra (@BrajMoh91150747) June 9, 2022
ఇది కూడా చదవండి: Viral Video: వైరల్ వీడియో: ఉన్నట్టుండి నడి రోడ్డుపై చేపల వర్షం.. ఎగబడ్డ జనం..