దేశంలో ఈ మద్య బాంబు దాడులు ఎక్కువ అవుతున్నాయి. ఇందులో ఎంతో మంది అమాయక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఎక్కువగా పొలిటికల్ లీడర్లను టార్గెట్ చేసుకొని జరిగే ఈ దాడుల్లో ఎన్నో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నిర్వహించే సభా ప్రాంగణం వద్ద బాంబు దాడి జరగడం కలకలం రేపింది. కాకపోతే స్వల్ప తీవ్రతతో కూడిన పేలుడు కావడంతో ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటనలో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నలందలో జరుగుతున్న జనసభలో పాల్గొన్నారు. అదే సమయంలో ఓ వ్యక్తి ఆ సభా ప్రాంగణం వైపు బాంబు విసిరాడు. కాకపోతే అది స్వల్పంగా పెలడంతో ఎవరీకీ ఏమీ కాలేదు. సంఘటన జరిగిన వెంటనే నితీష్ కుమార్ సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై ఆయనను సురక్షితమైన ప్రదేశానికి తరలించారు. సభా ప్రాంగణం వద్ద పేలుడు శబ్దానికి సభలో ఉన్నవారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.ఎంతో సెక్యూరిటీ మధ్య ఉండే సీఎం భద్రతలో వరుసగా ఇలాంటి లోపాలు చోటుచేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Bihar | A bomb was hurled near Bihar Chief Minister Nitish Kumar’s ‘Jansabha’ site in Nalanda. More details awaited.
— ANI (@ANI) April 12, 2022