ఈ మద్య రాజకీయ నేతలు ప్రయాణిస్తున్న వాహనాలు పలు సందర్భాల్లో ప్రమాదానికి గురి అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కాన్వాయ్ లు అనుకోని ప్రమాదాలకు గురి అవుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. అప్పుడప్పుడు నేతలు ప్రయాణిస్తున్న బోటు లు సైతం ప్రమాదాలకు గురి అవుతున్నాయి. తాజాగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కి తృటిలో ప్రమాదం తప్పింది. గంగానదిలో ఆయన ప్రయాణిస్తున్న బోటు వంతెన పిల్లర్ ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రమాదం జరగలేదని.. సీఎం సహ బోటులో ఉన్నవారంతా సురక్షితంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు.
శనివారం ఆయన గంగానదిలో ఉన్న ఛాత్ పూజా ఘాట్ల ఏర్పాట్లను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి వెళ్లారు. ఆ సమయంలో ఆయన వెంట పలువురు అధికారులు, ముఖ్య నేతలు ఉన్నారు. ఆ సమయంలో నిర్మాణంలో ఉన్న జేపీ సేతు బ్రిడ్జి కోసం ఏర్పాటు చేసిన పిల్లర్ ని బోటు ఢీ కొట్టింది. ఆ సమయంలో బోటు వేగం తక్కువగా ఉండటం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు అంటున్నారు.
ఈ విషయం గురించి కలెక్టర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రయాణిస్తున్న బోటు కి చిన్నపాటి సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రమాదం జరిగిందని.. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అందరూ సురక్షితంగా ఉన్నారని అన్నారు. ప్రమాదం తర్వాత సీఎం నితీష్ తో పాటు మరికొంత మందిని వేరే స్టీమ్ బోట్ లోకి తరలించినట్లు తెలిపారు. మొత్తానికి తమ అభిమాన నేతకు ఏ ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు కార్యకర్తలు, అభిమానులు.
Patna | Bihar CM Nitish Kumar’s boat collided with a pillar of JP Setu during the inspection of Chhath Ghat situated on the bank of river Ganga today. All onboard the boat including the CM are safe. pic.twitter.com/ga8vusRtjH
— ANI (@ANI) October 15, 2022
ఇది చదవండి : కశ్మీర్ సమస్యకు కారణం నెహ్రూ.. పరిష్కరించిన ఘనత మోదీదే!