ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్(EPF) ఖాతాదారులకు బిగ్ అలర్ట్. ఈపీఎఫ్ సభ్యులు తమ ఖాతాకు నామినీని యాడ్ చేసుకోకుంటే వారు తప్పక ఆ పని పూర్తి చేయాలి. అందుకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉందని ఈపీఎఫ్ ఆర్గనైజేషన్ తెలిపింది. అంటే నామినీ యాడ్ పక్రియ మార్చి 31లోగా పూర్తి చేయాలని పేర్కొంది. ఒక వేళ నిర్ణిత సమయంలో యాడ్ చేయకపోతే రిటైటర్మెంట్ కు సంబంధించిన ఈపీఎఫ్ ప్రయోజనాలను ఖాతాదారులు కోల్పోతారని హెచ్చరించింది. కరోనా సమయంలో EPF ఖాతారదారులకు అడ్వాన్స్ కింద రూ.లక్ష రూపాయాలను అందించింది. రూల్స్ సరిగ్గా పాటిస్తే ఇలాంటి ప్రయోజనాలు ఖాతాదారుల సొంతం అవుతాయి.
ఈపీఎఫ్ ఖాతాదారులు తమ జీవిత భాగస్వామిని లేక తల్లిదండ్రులు, తమ పిల్లలు ఇలా ఎవరిరైనా తమ అకౌంట్ కి నామినీని యాడ్ చేసుకోవాలని పేర్కొంది. నామినీని యాడ్ చేసిన తర్వాత, అనుకోని ప్రమాదం జరిగితే.. నామినీగా ఉన్న వారికి బీమా మరియు పెన్షన్ లాంటివి పొందగలుగుతారని..కాబట్టి ఈ నెలాఖరులోగా ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ఉద్యోగులకు సూచించింది. ఈ పనులు చేయకపోతే ఖాతాదారులు ఎంతో నష్టపోతారంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. E-నామినేషన్ పూర్తి చేసుకున్న ఖాతాదారులు EDLI పథకం ద్వారా రూ.7 లక్షల బీమాకు అర్హులు. అనుకోని ఘటనలో ఈపీఎఫ్ సభ్యుడు మరణిచినట్లయితే.. వారు నామినీకి యాడ్ చేసిన వారికి ఆ ప్రమాద భీమాను ఈపీఎఫ్ఓ అందిస్తోంది. కాబట్టి ఈ రెండు రోజుల్లో ఈ నామినీ యాడ్ పక్రియను పూర్తి చేయకుంటే పై బెనిఫిట్స్ కోల్పోతారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.