ఈ మద్య రైల్వే ఫ్లాట్ ఫామ్ పై ట్రైన్ నుంచి ప్రమాద వశాత్తు కిందపడితే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు, ఇతరులు కాపాడిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాయి. ఈ కాలంలో ఎవరి ప్రాణాలు వారికి తీపి.. ఎదుటి వారు ప్రమాదంలో ఉంటే కాపాడలంటే వెనుకా ముందు ఆడుతుంటారు. ప్రాణాలకు తెగించి.. మృత్యువుకి ఎదురెళ్లి మరీ అవతల వ్యక్తికి సాయం చేయడం అంటే నిజంగా మాములు విషయం కాదు. అయితే ఓ వ్యక్తి తన ప్రాణాలకు తెగించి స్పీడ్ గా వస్తున్న గూడ్స్ రైల్ కి ఎదురు వెళ్లి ఓ యువతిని కాపాడిన సంఘటన భోపాల్ లో చోటు చేసుకుంది. ఆ వ్యక్తిని ప్రతి ఒక్కరూ షభాష్ అని మెచ్చుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే..
ఇది చదవండి: ఏపీ ప్రత్యేక హోదా అంశం.. చర్చలకు కేంద్ర హోంశాఖ ఆహ్వానం!
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోని బర్ఖేడి ప్రాంతంలో మహ్మద్ మెహబూబ్ వృత్తిరీత్యా వడ్రంగి. మెహబూబ్ తన విధులు ముగించుకుని ఫ్యాక్టరీ నుంచి తన స్నేహితులతో కలిసి వస్తున్నాడు. ఆ సమయంలో వెనుక వైపు నుంచి గూడ్స్ రైలు రావడంతో కాసేపు ఆగిపోయారు. అనుకోకుండా అదే సమయంలో తల్లిదండ్రులతో వస్తున్న ఒక బాలిక రైల్వే ట్రాక్‌పై పడిపోయింది. ఆమె రక్షించే వ్యవధి లేదు పైగా రైలు వేగంగా వచ్చేస్తుంది. అందరూ టెన్షన్ లో మునిగిపోయారు. అక్కడే ఉన్న మెహబూబ్ తన ప్రాణాలను లక్ష్య పెట్టక మెరుపువేగంతో రైలుకి ఎదురెళ్లాడు.
ఆ రైల్వే పట్టాలపై పడి ఉన్న బాలిక చేతిని పట్టుకుని ట్రాక్ మధ్యలో కదలకుండా ఇద్దరూ పడుకుని ఉండిపోయారు. ఆమె తల ఎత్తకుండా పట్టుకున్నాడు. ఇంతలో గూడ్స్‌రైలు వేగంగా వారి మీద నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత వారిద్దరూ ఎలాంటి గాయాలు లేకుండా సురక్షింతంగా బయటపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. తన ప్రాణాలు లెక్కచేయకుండా రక్షించిన మహ్మద్ మెహబూబ్ షభాష్ అంటూ నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Incredible bravery! 37 year old Mehboob was returning to his factory when he and some other pedestrians saw a goods train they stopped to let it pass a girl standing with her parents in fell on the tracks Mehboob sprinted dragged kept her head down @manishndtv @GargiRawat pic.twitter.com/IDqQiBLAv7
— Anurag Dwary (@Anurag_Dwary) February 12, 2022