డబ్బు.. డబ్బు.. ఉదయాన్నే లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా దీని గురుంచే ఆలోచన. కష్టపడి సంపాదిస్తూ వెళ్తే ఎప్పటికీ కోటీశ్వరులం అవుతామన్న ఆలోచనతో అడ్డదారులు తొక్కుతున్నారు. దేశంలో నగదు చెలామణిని నిర్వహించే భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) చేసే పనిని.. వీరు ఇంట్లో నుంచే కానిచ్చేస్తున్నారు. ఇంతకీ.. వీరు చేస్తున్న పనేంటంటారా? నకిలీ కరెన్సీ ముద్రించడం. పోనీ, మనదేశపు కరెన్సీయేనా అంటే కాదు.. అగ్రరాజ్యం అమెరికా కరెన్సీ సైతం ముంద్రించేస్తున్నారు..! పాపం పండి పోలీసులకు పట్టుబడడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
బెంగళూరు, హెణ్ణూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఇంట్లో భారత్, అమెరికా నకిలీ కరెన్సీ ముద్రిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది ఆ ఇంటిపై దాడి చేశారు. అయితే అప్పటికే నిందితులు అక్కడి నుంచి జారుకోగా.. ఇంట్లో గాలించైనా పోలీసులకు కళ్లు బైర్లు కమ్మాయి. భారత కరెన్సీతో పాటు విదేశీ కరెన్సీని సైతం ఈ ముఠా ముద్రిస్తున్నారు. భారత్‌కు చెందిన రూ.500 నోట్లు 10,033, అమెరికాకు చెందిన వంద డాలర్ల నోట్లు 708 లభించాయి. అలాగే మరికొంత మొత్తంలో వెయ్యి రూపాయల పాత నోట్లు పట్టుబడ్డాయి. వీటితో పాటు ముద్రణకు వాడే రసాయనాల సీసాలు, నాలుగు కలర్ ప్రింటర్లు, ఇంక్‌జెట్ ఎల్రక్టానిక్ డైయింగ్ మెషిన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
The Central Crime Branch of #Bengaluru city police busted a counterfeit currency racket comprising African nationals that printed Indian and US currency notes worth Rs 1.10 crorehttps://t.co/7G99oBhY4k
— The Indian Express (@IndianExpress) December 15, 2022