కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమరానికి సమయం దగ్గరపడుతోంది. మే నెలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార బీజేపీతో సహా కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు వ్యూహాలకు పదునుపెట్టాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా, అమిత్ షా పర్యటన దృష్ట్యా బెంగళూరు నగర ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన చేశారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమరానికి సమయం దగ్గరపడుతోంది. మే నెలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార బీజేపీతో సహా కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు వ్యూహాలకు పదునుపెట్టాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా, అమిత్ షా పర్యటన దృష్ట్యా బెంగళూరు నగర ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు, వాహనాల రాకపోకలు సాఫీగా సాగేందుకు కొన్ని మార్గాలలో ప్రయాణించకపోవడం మంచిదంటూ ప్రయాణికులకు సూచనలు చేశారు.
కర్ణాటక అసెంబ్లీకి మే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 224 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, రాష్ట్ర రాజధాని పరిధిలోనే 28 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 28 నియోజకవర్గాలను కైవసం చేసుకోవాలన్నదే అధికార పార్టీ బీజేపీ లక్ష్యం. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగళూరు పర్యటనకు వస్తున్నారు. వీటితో పాటు మంత్రివర్గ విస్తరణ, అనేక వర్గాల నుంచి రిజర్వేషన్ల డిమాండ్.. వంటి సున్నిత సమస్యలకు పరిష్కారం చూపాల్సి ఉండడంతో హోంమంత్రి పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా, అమిత్ షా పర్యటన దృష్ట్యా బెంగళూరు నగర ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. కాగా, అమిత్ షా పర్యటనకు ముందు బెంగుళూరు పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. మార్చి 3న హోంమంత్రి నగరానికి వస్తున్న నేపథ్యంలో నగరంలో వాహనాల రాకపోకలు సాఫీగా సాగేలా చూడాలని బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఓ సలహా ఇచ్చారు. బళ్లారి రోడ్డు, హెబ్బాల జోన్, మేఖ్రీ సర్కిల్, Kr సర్కిల్ మరియు ఇతర మార్గాలను నివారించాలని ట్రాఫిక్ పోలీసులు ప్రయాణికులను కోరారు.
Avoid travelling on these road stretches tomorrow (March 3) from 3:00 pm to 9:00 pm as Union home minister @AmitShah will be visiting #Bengaluru. @TOIBengaluru #Bangalore #Traffic #Transport #Alert #Karnataka pic.twitter.com/okEdnGSv25
— Niranjan Kaggere (@nkaggere) March 2, 2023