ఇంటర్నెట్ చవకగా లభించడం.. న్యూ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీలు పలు వినోద కార్యక్రమాలను రూపొందించడం, వినూత్న రీతిలో వీడియో గేమ్స్ డిజైన్ చేయడం వంటివి చేస్తున్నారు. వీటి పట్ల ఆకర్షితులైన వారు.. ఆ తర్వాత వాటికి బానిసలుగా మారి.. అనూహ్య నిర్ణయాలు తీసుకుంటూ.. తల్లిదండ్రులకు షాక్ ఇస్తున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి కర్ణాటకలో చోటు చేసుకుంది. పబ్జీలు, రియాలటీషోలతో ప్రభావితమైన నలుగురు అమ్మాయిలు ఏదైనా సాధించాలనే తపనతో ఉన్నఫళంగా ఇళ్లు వదిలారు. బస్సు ఎక్కి బెంగళూరు చేరుకోగా డ్రైవర్, కండక్టర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి వారిని సురక్షితంగా పోలీసులకు అప్పగించారు. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: పబ్‌జీ ఆట కోసం 12 ఏళ్ల బాలుడు చేసిన పనికి అంతా షాక్!
బళ్లారిలోని పార్వతీనగర్‌లో నివాసం ఉంటున్న రెండు కుటుంబాలకు చెందిన దాదాపు పదేళ్ల వయసున్న ఆడపిల్లలు నలుగురు గతనెల 26న మధ్యాహ్నం ఇళ్లు వదిలారు. ఏదైనా సాధించేందుకు వెళ్తున్నామని, అంతవరకు తాము ఎక్కడున్నా పట్టించుకోవద్దని సెల్‌ఫోన్‌లో రికార్డు చేశారు. ఆ తర్వాత వీరంతా బళ్లారిలోని కొత్త బస్టాండ్‌కు చేరుకుని.. బెంగళూరు వెళ్లే బస్సు ఎక్కారు. వీరి వెంట పెద్దలు లేకపోవడంతో.. డ్రైవర్, కండక్టర్‌కు అనుమానం వచ్చి.. ఆరా తీశారు. అందుకు ఆ అమ్మాయిలు.. కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్తున్నట్లు తెలిపారు. అయితే ఆ తర్వాత బస్సు రాత్రి 12 గంటల ప్రాంతంలో బెంగళూరులో ఆగింది. కానీ ఆ అమ్మాయిలు బస్సు దిగకుండా.. భయంతో దిక్కులు చూస్తుండటంతో.. డ్రైవర్, కండక్టర్‌కు అనుమానం వచ్చి.. ఉప్పారపేటె పోలీసు స్టేషన్‌లో అప్పగించారు. మరో వైపు వీరి తల్లిదండ్రులు ఈ పిల్లలు కనిపించడం లేదని.. గాలింపు చేపట్టారు.
ఇది కూడా చదవండి: ఆ ఒక్క కారణంతోనే తండ్రి కొడుకుని నడిరోడ్డుపై తగలబెట్టాడు: వీడియో వైరల్!ఉప్పారపేటె పోలీసు స్టేషన్‌లో చిన్నారులు ఉన్న విషయం సామాజిక మాధ్యమాల్లో రావడంతో తల్లిదండ్రులు వెళ్లి బళ్లారికి తీసుకొని వచ్చారు. ఈ క్రమంలో తమ బిడ్డలను క్షేమంగా ఇంటికి చేర్చిన బస్సు డ్రైవర్ రవికుమార్, కండక్టర్ నవాజ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: గర్ల్‌ఫ్రెండ్ కోసం ఆటో డ్రైవర్‌గా.. 74 ఏళ్ల వయసులో ఎందుకిలా?..