ఇటీవల పలు చోట్ల విమాన ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. టేకాఫ్ అయిన తర్వాత టెక్నికల్ ఇబ్బందులు తలెత్తడంతో పైలెట్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్నారు.
ఈ మద్య పలు దేశాల్లో వరుసగా విమాన, హెలికాప్టర్ ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే సాంకేతిక లోపాల వల్ల, ప్రకృతి విపత్తు, పక్షులు ఢీ కొట్టడం లాంటివి జరగడం.. కొన్నిసార్లు మానవ తప్పిదాల వల్ల కూడా ప్రమాదాలు జరగుతున్నాయి. విమానంలో ఏ మాత్రం పొగ వచ్చినా ప్రయాణికులు భయంతో వణికిపోతుంటారు. తాజాగా విమానంలో ఓ వ్యక్తి బీడీ తోటి ప్రయాణీకులను భయబ్రాంతులకు గురి చేసిన ఘటన బెంగుళూరు లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
బెంగుళూరు ఆకాశ ఎయిర్ విమానంలో తొలిసారిగా ఓ వృద్దుడు ప్రయాణిస్తున్నాడు. సాధారణంగా బస్సు, ట్రైన్లలో ప్రయాణించేటపుడు విండో సీటు వైపు కూర్చుంటే ధూమపానం చేస్తుంటారు. అలాగే విమానంలో కూడా అలాంటి సౌకర్యం ఉంటుందేమో అని వృద్దుడు విమానంలోని లావెటరీకి వెళ్లి బీడీ ముట్టించి కాల్చాడు. దీంతో పొగ రావడంతో తోటి ప్రయాణికులు భయంతో వణికిపోయారు. తోటి ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగించాడంటూ విమానంలోని సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. విమానం ల్యాండ్ అయ్యాక వృద్దుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తనకు ఇలాంటి ఫార్మాలిటీస్ తెలియకపోవడం వల్ల కాల్చాను మొర్రో అని ఎంత ప్రాదేయపడ్డా చేసింది తప్పే అంటూ జైలుకు పంపించారు.
ఈ కేసులో అరెస్ట్ అయితే కనీసం వారం రోజుల పాటు జైలులోనే ఉండాల్సి వస్తుందని పోలీసులు చెప్పారు. బెంగుళూరు విమానాశ్రయంలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ పాలి జిల్లాకు చెందిన ప్రవీణ్ కుమార్ మంగళవారం గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి బెంగుళూరుకు ఆకాశ ఎయిర్ విమానంలో ప్రాయాణించాడు. మార్గ మద్యలో లావెటరీకి వెళ్లిన కుమార్ లోపల బీడీ కాల్చాడు. సెక్యూరిటీ అలారం ద్వారా ఈ విషయం విమాన సిబ్బంది గుర్తించి పైలట్ కు, ఎయిర్ లైన్స్ అధికారులకు ఫిర్యాదు చేయగా.. వారు ప్రవీణ్ కుమార్ ని పోలీసులు అరెస్ట్ చేసి బెంగుళూర్ సెంట్రల్ జైలు కి తరలించారు. ఈ సందర్బంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. తాను తరుచూ ట్రైన్ లో వెళ్లేవాడని.. వాష్ రూమ్ లో బీడీ కాల్చే అలవాలు ఉందని.. విమానంలో కాల్చొద్దు అన్న రూల్ తెలియక చేశారని వివరించాడు.